రైల్వే చార్జీల్లో స్వల్ప పెరుగుదల! | Indian Railways to hike passenger fares from July 1 | Sakshi
Sakshi News home page

రైల్వే చార్జీల్లో స్వల్ప పెరుగుదల!

Jun 25 2025 3:01 AM | Updated on Jun 25 2025 3:01 AM

Indian Railways to hike passenger fares from July 1

న్యూఢిల్లీ: రైల్వే చార్జీలు త్వరలో నామమాత్రంగా పెరిగే అవకాశముంది. మెయిల్, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో నాన్‌ ఏసీ తరగతికి కిలోమీటర్‌కు ఒక పైసా, ఏసీ ప్రయాణాలకు 2 పైసల చొప్పున పెంచే ప్రతిపాదన ఉన్నట్టు రైల్వే శాఖ వర్గాలు వెల్లడించాయి. బోర్డు ఆమోదం లభిస్తే జూలై 1 నుంచి ఈ పెంపు అమల్లోకి వస్తుందని తెలిపాయి.

‘‘2020, 2013ల్లో చేసిన పెంపుతో పోలిస్తే ఇది సగమే. అంతేగాక రోజువారీ ప్రయాణికుల ప్రయోజనాల దృష్ట్యా సబర్బన్, నెలవారీ, సీజన్‌ పాసుల చార్జీలు పెంచబోవడం బోదు. ఆర్డినరీ సెకండ్‌ క్లాస్‌ టికెట్ల ధరలు కూడా 500 కి.మీ. దాకా పెరగబోవు. ఆ తర్వాత కి.మీ.కి అర పైసా చొప్పున పెంచే ప్రతిపాదన ఉంది’’ అని పేర్కొన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement