Indian Railway Is Not In Sikkim State, Not A Single Train Has Run In This State Of India - Sakshi
Sakshi News home page

దేశంలో నేటికీ రైళ్లు నడవని రాష్ట్రం అది.. భారీ నెట్‌వర్క్‌ ఉన్నా..

Published Mon, Jun 26 2023 7:16 AM

Indian Railway is not in Sikkim State - Sakshi

మన దేశంలో ‍ప్రతిరోజూ కొన్ని కోట్లమంది రైలు ప్రయాణం సాగిస్తుంటారు. భారతీయ రైల్వే ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌ కలిగిన వ్యవస్థగా గుర్తింపు పొందింది. నేడు భారతీయరైల్వే దేశంలోని ప్రతీ ప్రాంతానికీ విస్తరించింది. 

మనం దేశంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడ మనకు రైల్వే స్టేషన్‌ తప్పనిసరిగా కనిపిస్తుంది. దూర ప్రయాణాలు సాగించేవారు తప్పనిసరిగా రైలు ప్రయాణాన్నే ఎంచుకుంటారు. భారతీయ రైల్వే లైన్‌ పొడవు ఒక లక్షా 15 వేల కిలోమీటర్లు. దేశంలోని ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా రైలులో వెళ్లవచ్చు. 

నేటికీ రైలు మార్గం లేని రాష్ట్రం


అయితే మనదేశంలోని ఒక రాష్ట్రం.. నేటికీ ఎటువంటి రైలు రాకపోకలకు నోచుకోలేదు. ఈ మాట వినగానే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది.  ఈ విషయం చాలామందికి తెలియదు. ఈ మాట వినగానే కొందరు దేశంలోని రైలు నడవని రాష్ట్రం కూడా ఉందా అనే ఆలోచనలోపడతారు. అందుకే ఇప్పుడు ఆ రాష్ట్రం ఎక్కడుందో తెలుసుకుందాం. 

నేటికీ రైల్వే లైన్‌ లేని రాష్ట్రం సిక్కిం. ఈ రాష్ట్రంలో రైలు అన్నదే కనిపించదు. దేశంలోని రైలు వ్యవస్థలేని రాష్ట్రం ఇదొక్కటే. అత్యంత పెద్ద నెట్‌వర్క్‌ కలిగిన భారతీయ రైల్వే సిక్కింనకు చేరుకోలేకపోయింది. అయితే ఇప్పుడు అక్కడ అత్యంత వేగంగా రైల్వే లైన్‌కు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. 2024 నుంచి రాష్ట్రంలో రైలు సేవలు ప్రారంభంకానున్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement