భారత్‌, పాక్‌ యుద్ధం.. దేశంలో 32 విమానాశ్రయాలు మూసివేత | Indian airports 32 shut flights amid tensions with Pakistan | Sakshi
Sakshi News home page

భారత్‌, పాక్‌ యుద్ధం.. దేశంలో 32 విమానాశ్రయాలు మూసివేత

May 10 2025 9:08 AM | Updated on May 10 2025 4:46 PM

Indian airports 32 shut flights amid tensions with Pakistan

ఢిల్లీ: భారత్‌, పాకిస్తాన్‌ మధ్య భీకర యుద్ధం వేళ భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (AAI) కీలక ప్రకటన చేసింది. తాజాగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా దేశంలోని 32 విమానాశ్రయాలలో అన్ని రకాల పౌర విమాన కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు విమానాశ్రయాల వివరాలను వెల్లడించింది.

వివరాల ప్రకారం.. ఉత్తర , పశ్చిమ భారతదేశంలోని పలు విమానాశ్రయాల్లో విమాన కార్యక్రమాలు నిలిపిపోయాయి. 32 విమానాశ్రయాలలో అన్ని రకాల పౌర విమాన కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు  AAI తెలిపింది. భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం.. మే 8న తొలుత 24 విమానాశ్రయాలను మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా 32 విమానాశ్రయాల్లో కార్యక్రమాలను నిలిపివేశారు.

  • విమానాశ్రయాలు ఇవే..
    అమృత్‌సర్, 
    చండీగఢ్, 
    జైసల్మేర్, 
    జమ్మూ, 
    పటియాలా, 
    పోర్‌బందర్, 
    పఠాన్‌కోట్,  
    అవంతిపూర్, 
    బటిండా, 
    భుజ్, 
    బికానెర్,  
    హల్వారా, 
    అధమ్‌పూర్, 
    అంబాలా, 
    హిండన్, 
    జామ్‌నగర్, 
    జోధ్‌పూర్, 
    కండ్లా, 
    కాంగ్రా (గగ్గల్), 
    కేశోద్, 
    కిషన్‌గఢ్, 
    కులు మనాలి (భుంటార్), 
    లేహ్, 
    లుధియానా, 
    ముంద్రా, 
    నలియా, 
    రాజ్‌కోట్ (హిరాసర్), 
    సర్సావా, 
    షిమ్లా, 
    శ్రీనగర్, 
    థోయిస్ , 
    ఉత్తర్‌లై.

ఈ పరిణామాల నేపథ్యంలో, ఇప్పటికే పలు విమానయాన సంస్థలు ప్రభావిత ప్రాంతాలకు తమ విమానాలను రద్దు చేశాయి. ఎయిర్ ఇండియా జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్‌పూర్, అమృత్‌సర్, చండీగఢ్, భుజ్, జామ్‌నగర్ , రాజ్‌కోట్‌లకు వెళ్లే , వచ్చే విమానాలను రద్దు చేసింది. ప్రయాణికులకు పూర్తి వాపసు లేదా ఒకసారి ఉచితంగా రీషెడ్యూల్ చేసుకునే అవకాశం కల్పించింది.

ఇండిగో కూడా NOTAM పరిధిలోకి వచ్చే అనేక నగరాలకు తమ సేవలను నిలిపివేసింది. ప్రయాణికులు తమ విమాన స్థితిని తెలుసుకోవడానికి, రీబుక్ చేసుకోవడానికి లేదా వాపసు కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఆన్‌లైన్ లింక్‌లను అందుబాటులో ఉంచింది. భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయడంతో, ప్రయాణికులు విమానం బయలుదేరే సమయానికి కనీసం మూడు గంటల ముందు విమానాశ్రయానికి చేరుకోవాలని విమానయాన సంస్థలు సూచించాయి. 

Advertisement
 
Advertisement
Advertisement