మరో 2.64 లక్షల కేసులు

India single day Covid tally at 2,64,202, positivity rate touches 14. 78percent - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా సంక్రమణ వేగం ప్రతిరోజూ మరింతగా పుంజుకుంటోంది. గత 24 గంటల్లో ఏకంగా 2,64,202 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,65,82,129కు చేరుకుంది. వీటిలో 5,753 ఒమిక్రాన్‌ కేసులు ఉన్నాయి. గత 220 రోజుల్లో లేనంతగా యాక్టివ్‌ కేసులు 12,72,073కు పెరిగాయి. మరో 315 మంది కోవిడ్‌తో కన్నుమూశారు. దీంతో మొత్తం కోవిడ్‌ బాధితుల మరణాల సంఖ్య 4,85,350కు ఎగబాకింది.

రికవరీ రేటు 95.20 శాతానికి తగ్గింది. రోజువారీ పాజిటివిటీ రేటు గణనీయంగా 14.78 శాతానికి పెరిగింది. మరణాల రేటు 1.33 శాతంగా నమోదైంది. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 155.39 కోట్ల కోవిడ్‌ టీకాలను కేంద్రం పంపిణీచేసింది. ఇప్పటిదాకా 3,48,24,706 మంది కోవిడ్‌ నుంచి కోలుకున్నారు. మరోవైపు ఢిల్లీలో పాజిటివిటీ రేటు ఆందోళనకర స్థాయిలో 29.21 శాతానికి పెరిగింది. గత 24 గంటల్లో 24వేలకుపైగా  కేసులులొచ్చాయి.  మహారాష్ట్రలో 43వేలకుపైగా కేసులు నమోదయ్యాయి.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top