ఒక్కరోజే 53 వేల మంది రికవరీ | India Reports 50357 New Coronavirus Cases And 577 Deaths | Sakshi
Sakshi News home page

ఒక్కరోజే 53 వేల మంది రికవరీ

Nov 7 2020 10:13 AM | Updated on Nov 7 2020 11:35 AM

India Reports 50357 New Coronavirus Cases And 577 Deaths - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ బారినపడి కోలుకుంటున్నవారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 53,920 కోవిడ్‌ బాధితులు కోలుకున్నారు. దాంతో ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 78,19,887 కు చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. భారత్‌లో కోవిడ్‌ బాధితుల రికవరీ రేటు 92.42 శాతంగా ఉందని వెల్లడించింది. అదే సమయంలో మరణాల రేటు1.48 శాతంగా ఉందని శనివారం ఉదయం విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది.

ప్రస్తుతం భారత్‌లో 5,16,632 యాక్టివ్‌ కేసులున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 11,13,209  కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 50,357 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 84,62,081 కు చేరింది. కోవిడ్‌ బారినపడ్డవారిలో మరో 577 మంది మృతి చెందడంతో.. ఆ మొత్తం సంఖ్య 1,25,562 కు చేరింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 11,65,42,304 వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేశామని భారత వైద్య పరిశోధన సంస్థ (ఐసీఎంఆర్‌) పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement