రికార్డు స్థాయిలో రికవరీ | India records 62064 new corona cases | Sakshi
Sakshi News home page

రికార్డు స్థాయిలో రికవరీ

Aug 11 2020 5:59 AM | Updated on Aug 11 2020 5:59 AM

India records 62064 new corona cases - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో వరుసగా నాలుగో రోజూ 60 వేలకు పైగా కేసులు వెలుగుచూశాయి. సోమవారం కొత్తగా 62,064 కేసులు బయట పడటంతో మొత్తం కేసుల సంఖ్య 22,15,074కు చేరుకుంది. 24 గంటల్లో రికార్డు స్థాయిలో 54,859 కోలుకోగా, 1,007 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 44,386కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా కేసులు పది లక్షల నుంచి 22 లక్షలకు చేరుకోవడానికి కేవలం 24 రోజులు పట్టింది.

దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 15,35,743కు చేరుకోగా, యాక్టివ్‌ కేసుల సంఖ్య 6,34,945 గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసుల రేటు 28.66%గా ఉంది. దేశంలో కరోనా రికవరీ రేటు దాదాపు 70 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 2 శాతానికి పడిపోయిందని తెలిపింది. గత 12 రోజులుగా ప్రతి రోజూ 50 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.  మొత్తం మరణాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది. తర్వాతి స్థానాల్లో తమిళనాడు, ఢిల్లీ ఉన్నాయి. ఆగస్టు 9 వరకు 2,45,83,558 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement