అంబేద్కర్‌ జయంతి.. కేంద్రం క్లోజ్డ్‌ హాలీడే

India Govt declares April 14th Ambedkar Jayanti as gazetted holiday - Sakshi

ప్రతీ ఏడాది ఏప్రిల్‌ 14న డాక్టర్‌ భీమ్‌ రావ్‌ అంబేద్కర్‌ జయంతి సందర్భంగా.. దేశవ్యాప్తంగా వేడుకలు, రకరకాల కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. భారత రాజ్యాంగ రూపకర్తకు గౌరవసూచీకగా, ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ ఈ తేదీన అంబేద్కర్‌కు ఘనంగా నివాళులు అర్పిస్తుంటుంది కూడా. అయితే.. అంబేద్కర్‌ జయంతి అనేది పబ్లిక్‌ హాలీడే అవునా? కాదా? అనే చర్చ తరచూ తెర మీదకు వస్తుంటుంది. 

అందుకు కారణం.. అంబేద్కర్‌ జయంతిని చాలాకాలం పాటు జాతీయ సెలవు దినంగా కేంద్రం గుర్తించకపోవడం. రిపబ్లిక్‌ డే, ఇండిపెండెన్స్‌ డే, గాంధీ జయంతి.. ఇలా ప్రత్యేక రోజుల్లాగా కాకుండా అంబేద్కర్‌ జయంతిని పరిమితుల మధ్య జరుపుకుంటోంది దేశం. కొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత రాష్ట్రాల్లో కొన్ని మాత్రమే పబ్లిక్‌ హాలీడేగా ఆచరిస్తున్నాయి. అయితే..  

2020 కరోనా టైంలోనే కేంద్రం అంబేద్కర్‌ జయంతిని గెజిటెడ్‌ నోటిఫికేషన్‌ ద్వారా జాతీయ సెలవు దినంగా ప్రకటించింది. ఆ తర్వాత సంవత్సరాల్లో మిగతా సెలవుల్లో అంబేద్కర్‌ జయంతి కలిసిపోతూ వచ్చింది. ఇదిలా ఉంటే.. తాజాగా  కేంద్రం అంబేద్కర్‌ జయంతిని గెజిటెడ్‌ పబ్లిక్‌ హాలీడేగా ప్రకటించింది.  1881 నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ యాక్ట్‌ సెక్షన్‌ 25 ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం  ఏప్రిల్‌ 14, 2023ను క్లోజ్డ్‌ హాలీడేగా ప్రకటిస్తూ ఓ గెజిట్‌ నోటిఫికేషన్‌ను రిలీజ్‌ చేసింది.

మరోవైపు ఈ నోటిఫికేషన్‌తో సంబంధం లేకుండానే సుప్రీం కోర్టు సెలవు ప్రకటించుకోవడం గమనార్హం. సీజేఐ డీవై చంద్రచూడ్‌ ఆదేశాలనుసారం దేశ సర్వోన్నత న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. 

మరోవైపు అదే రోజున సిక్కులకు పెద్ద పండుగ వైశాఖి (బైశాఖి) ఉంది. కొన్నిరాష్ట్రాల ప్రభుత్వాలకు ఈ పండుగకు సెలవు ప్రకటించడంతో.. విద్యా సంస్థలు, వ్యాపారాలు స్వచ్ఛందంగా మూతపడనున్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top