
పట్నా: 26 పార్టీలతో కూడిన విపక్ష ‘ఇండియా’ కూటమి సమన్వయ కమిటీ చైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ నేత సోనియా గాందీ, కన్వినర్‌గా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. కూటమి తదుపరి సమావేశం ఆగస్టు 31, సెప్టెంబర్ 1న ముంబైలో జరుగనుంది.
కూటమికి చెందిన 11 మంది సభ్యుల సమన్వయ కమిటీ చైర్‌పర్సన్‌గా సోనియా గాం«దీని, కన్వినర్‌గా నితీశ్ కుమార్‌ను ఈ సమావేశాల్లో ఎన్నుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.