ఆ రాజకీయాలను దేశం నుంచి తరిమికొట్టాలి

India asking corruption, dynasty, appeasement to quit India Says PM Narendra Modi - Sakshi

న్యూఢిల్లీ: అవినీతి నిర్మూ లన, వారసత్వ, బుజ్జగింపు రాజకీయాలను భారత్‌ నుంచి తరిమి కొట్టాలని ప్రజలు నినదిస్తున్నారని  ప్రధాని∙మోదీ అన్నారు.  ప్రతిపక్ష కాంగ్రెస్‌పై పరోక్షంగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. స్వాతంత్య్ర పోరాటంలో 1942 ఆగస్టు 9న మహాత్మా గాంధీ చేపట్టిన క్విట్‌ ఇండియా ఉద్యమ సంస్మరణ దినాన్ని బుధవారం బీజేపీ నిర్వహించింది.

ఈ సందర్భంగా మూడింటిని దేశం నుంచి తరిమి కొట్టాలని ఒకే స్వరం వినిపిస్తోందని ప్రధాని చెప్పారు. ‘అవినీతిని దేశం నుంచి తరిమేయాలి. వారసత్వ రాజకీయాలను, బుజ్జగింపు రాజకీయాలను కూడా తరిమికొట్టాలి’’ అని ప్రధాని బుధవారం ఒక ట్వీట్‌లో వెల్లడించారు. మరోవైపు బీజేపీ నేత రవిశంకర్‌ ప్రసాద్‌ మీడియాతో మాట్లాడుతూ దేశ ప్రయోజనాలు పరిరక్షించాలంటే అవినీతి, వారసత్వ, బుజ్జగింపు రాజకీయాలకు చోటు ఉండకూడదని అన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top