నేను సూపర్‌ సీఎంను కాదు:సీఎం కుమారుడు | Im Not A Super CM Says B Y Vijayendra | Sakshi
Sakshi News home page

నేను సూపర్‌ సీఎంను కాదు:సీఎం కుమారుడు

Feb 14 2021 9:41 PM | Updated on Feb 14 2021 9:41 PM

Im Not A Super CM Says B Y Vijayendra - Sakshi

బెంగళూరు : నేను సూపర్‌ సీఎంను కాదు, సీఎం యడియూరప్ప పనుల్లో నేను జోక్యం చేసుకోవడం లేదు అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర అన్నారు. శనివారం గవిగంగాధరేశ్వర దేవాలయంలో ఆయన పూజలు చేశారు. విలేకరులతో మాట్లాడుతూ నా పరిమితి ఏమిటనేది తెలుసు, నేను సీఎం కుమారుడిని అయినా తండ్రి పనుల్లో వేలు పెట్టడం లేదు అన్నారు. కాగా, ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు బడ్జెట్‌ ద్వారా సమాధానం చెబుతానని సీఎం యడియూరప్ప తెలిపారు.

శనివారం సాయంత్రం మైసూరులోని మండకళ్లి విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ బడ్జెట్‌ను రూపొందిస్తున్నా, రెండు శాఖలతో మాత్రమే సమావేశం జరపాల్సి ఉంది అన్నారు. ప్రభుత్వం టేకాఫ్‌ కాలేదని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు బడ్జెట్‌ ద్వారానే బదులిస్తానన్నారు. రిజర్వేషన్ల కోసం ఆయా సామాజికవర్గాలు చేస్తున్న పోరాటాన్ని అర్థం చేసుకోగలనని, వారందరికి తప్పక న్యాయం చేస్తానని చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement