వాట్సప్‌ సమస్యలపై గ్రీవెన్స్ ఆఫీసర్‌కి కంప్లైంట్ చేయడం ఎలా?

How To Contact WhatsApp Grievance Officer - Sakshi

సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇండియాలో గ్రీవెన్స్ ఆఫీసర్ అంటే ఫిర్యాదుల స్వీకరణ అధికారిని నియమించింది. పరేష్ బీ లాల్‌ను గ్రీవెన్స్ ఆఫీసర్ ఆఫ్ ఇండియాగా నియమించింది. భారత ప్రభుత్వం  ఫిబ్రవరి 25న కొత్తగా ఐటీ రూల్స్‌ని రూపొందించిన సంగతి తెలిసిందే. ఆ రూల్స్ మే 25 నుంచి అమలులోకి వచ్చాయి.  ఆ కొత్త నిబంధనల ప్రకారం.. మన దేశానికి చెందిన పౌరులను గ్రీవెన్స్ ఆఫీసర్, నోడల్ ఆఫీసర్, చీఫ్ కంప్లయెన్స్ ఆఫీసర్‍లను నియమించాల్సి ఉంటుంది. ప్రతి సోషల్ మీడియా కంపెనీ ఈ అధికారులను తప్పక నియమించాలి. 

వాట్సప్ కొత్త గ్రీవెన్స్ ఆఫీసర్ కార్యాలయం హైదరాబాద్‌లోనే ఉండటం విశేషం. వాట్సాప్ సంబంధిత సమస్యలను పోస్టు ద్వారా, ఈ-మెయిల్ ద్వారా వాట్సప్ ఫిర్యాదుల అధికారికి కంప్లైంట్ చేయొచ్చు. ఈ-మెయిల్ ద్వారా కంప్లైంట్ చేయాలనుకుంటే grievance_officer_wa@support.whatsapp.com మెయిల్ ఐడీకి ఫిర్యాదు చేయొచ్చు. ఈ-మెయిల్ లో తప్పనిసరిగా ఎలక్ట్రానిక్ సంతకంతో సంతకం చేయాలి. ఒక నిర్దిష్ట ఖాతా గురించి వాట్సాప్‌ను సంప్రదించాలనుకుంటే వారు తమ ఫోన్ నంబర్‌ను కంట్రీ కోడ్‌తో సహా పూర్తి అంతర్జాతీయ ఫార్మాట్‌లో ఈ-మెయిల్‌లో చేర్చాలని తెలిపింది.

గ్రీవెన్స్ ఆఫీసర్‌ను పోస్ట్ ద్వారా సంప్రదించాలనుకునే వారు తమ సమస్యలను పోస్ట్ బాక్స్ నెంబర్ 56, రోడ్ నెంబర్ 1, బంజారా హిల్స్, హైదరాబాద్ - 500 034, తెలంగాణకు పోస్ట్ చేయవచ్చు. పరేష్ బీ లాల్‌ను గ్రీవెన్స్ ఆఫీసర్‌ని యాప్ సేవా నిబంధనలు, చెల్లింపులు, వారి ఖాతా గురించి ప్రశ్నలు ఉంటే వినియోగదారులు సంప్రదించవచ్చని వాట్సాప్ తెలిపింది. కొత్త నిబంధనల ప్రకారం ఫిర్యాదుల అధికారి 24 గంటలలోపు ఫిర్యాదును గుర్తించి 15 రోజుల్లోపు పరిష్కరించాలి.

చదవండి: కేవలం రూ.2500కే జియో 5జీ ఫోన్

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top