Assam Home Guard: నిజాయితీకి దక్కిన సత్కారం

Honesty pays off for Assam home guard - Sakshi

గువాహటి: కోట్ల రూపాయల విలువైన మాదకద్రవ్యాల సరఫరాలో తమకు సహకరిస్తే భారీ నజరానా ఇస్తామని డ్రగ్‌ డీలర్లు ఆశజూపినా.. నిజాయితీకే కట్టుబడ్డాడు ఆ హోం గార్డు. అతని నిజాయతీకి, నిఖార్సయిన విధి నిర్వహణకు ప్రతిఫలంగా అస్సాం ప్రభుత్వం ఆయనను కానిస్టేబుల్‌ ఉద్యోగంతో సత్కరించింది. శనివారం ఆ హోంగార్డు బోర్సింగ్‌ బేకు కానిస్టేబుల్‌ నియామక పత్రాన్ని రాష్ట్ర సీఎం హిమంత స్వయంగా అందజేశారు.

జూన్‌ 21న కార్బి అంగ్లాంగ్‌ జిల్లాలోని ఓ చెక్‌పోస్టు వద్ద మాదకద్రవ్యాల అక్రమ రవాణా జరుగుతోంది. అక్కడే విధుల్లో ఉన్న హోం గార్డు బస్సులో అక్రమ రవాణాను పసిగట్టాడు. అయితే, పోలీసులను ఏమార్చేందుకు, తమకు సాయపడేందుకు ఒప్పుకుంటే భారీ స్థాయిలో లంచమిస్తామని హోం గార్డు బోర్సింగ్‌కు డ్రగ్‌ డీలర్లు ఆశపెట్టారు. అందుకు బోర్సింగ్‌ ససేమిరా ఒప్పుకోలేదు. బస్సులో ఉన్న రూ.12 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకోవడంలో పోలీసులకు సాయపడ్డాడు. దీంతో, హోం గార్డు నిజాయతీకి మెచ్చి  సీఎం అతనికి కానిస్టేబుల్‌ ఉద్యోగనియామక పత్రం అందజేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top