కశ్మీర్‌ లోయలో వరుస హత్యలు.. బెంగళూరులో హిజ్బుల్ ఉగ్రవాది అరెస్ట్‌

Hizbul terrorist arrested in BengaluruTargeted Killing Of Hindus In JK - Sakshi

బెంగళూరు: ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ సంస్థ టాప్‌ కమాండర్‌, టెర్రరిస్ట్‌ తాలిబ్ హుస్సేన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. జమ్మూ కశ్మీర్‌ లోయలో హిందువులను లక్ష్యంగా చేసుకుని హత్య చేసిన కేసులో జమ్మూకశ్మీర్ పోలీసులు బెంగుళూరులో ఇతడిని అదుపులోకి తీసుకున్నారు. బెంగుళూరులో ఉగ్రవాది అరెస్టుపై ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందించారు. ప్రజల కదలికలపై పోలీసుల నిఘా నిరంతరం ఉంటుందన్నారు. ఉగ్రవాదిని అరెస్ట్‌ చేయడంలో తమ పోలీసులు పూర్తి సహాయం అందించారన్నారు.  బెంగుళూరులో తాలిబ్ హుస్సేన్‌ను జమ్మూ కశ్మీర్ పోలీసులు అరెస్టు చేయడంలో తాము సాయం చేసినట్లు వెల్లడించారు.

కశ్మీర్ పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్ మాట్లాడుతూ.. రాహుల్ భట్ హత్యలో ఇద్దరు ఉగ్రవాదులు ప్రమేయం ఉండగా ఒకరిని అంతమొందించినట్లు తెలిపారు. అమ్రీన్ భట్ హత్య కేసులో, ఇద్దరు ఉగ్రవాదులను గుర్తించి మట్టుబెట్టారు. ఇక విజయ్ కుమార్ హత్యలో కేసులో ఉగ్రవాదులు గుర్తించామని వారిని త్వరలో అరెస్టు చేస్తామన్నారు. కాగా జూన్‌ 2న జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌లో ఎలాహి దేహ‌తి బ్యాంక్‌ మేనేజర్‌ను ఉగ్రవాదులు కాల్చిచంపిన విషయం తెలిసిందే. మేనేజ‌ర్ క్యాబిన్‌లో ఉన్న విజ‌య్ కుమార్‌ను ఓ ఉగ్ర‌వాది త‌న చేతుల్లోని తుపాకీతో కాల్చేశాడు. రెండు రౌండ్ల కాల్పులు జ‌రప‌డంతో మేనేజ‌ర్ అక్క‌డే కుప్ప‌కూలిపోయాడు.
చదవండి: బీజేపీకి సంకటం.. దేశ ప్రతిష్టకు భంగపాటు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top