ఏడాదిలోగా విడాకులివ్వలేం | Hindu Marriage Cannot Be Dissolved Within One Year Without Exceptional Grounds: | Sakshi
Sakshi News home page

ఏడాదిలోగా విడాకులివ్వలేం

Jan 30 2025 2:04 AM | Updated on Jan 30 2025 4:04 AM

Hindu Marriage Cannot Be Dissolved Within One Year Without Exceptional Grounds:

హిందూ దంపతుల పిటిషన్‌పై అలహాబాద్‌ హైకోర్టు స్పష్టీకరణ  

ప్రయాగ్‌రాజ్‌: హిందూ వివాహ చట్టం ప్రకారం.. హిందూ మతంలో వివాహ బంధానికి ఎంతో పవిత్రత ఉందని ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌ హైకోర్టు స్పష్టంచేసింది. హిందూ దంపతులకు పెళ్లయిన ఏడాదిలోనే విడాకులు మంజూరు చేయలేమని తేల్చిచెప్పింది. అసాధారణమైన పరిస్థితుల్లో తప్ప వారికి విడాకులు ఇవ్వడం సాధ్యం కాదని పేర్కొంది. పవిత్రమైన వారి బంధాన్ని విచ్ఛిన్నం చేయలేమని వెల్లడించింది.

 తమకు విడాకులు మంజూరు చేయాలంటూ దంపతులు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ అశ్వనీ కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ దోనాది రమేశ్‌తో కూడిన హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. హిందూ దంపతులు విడాకుల కోసం దరఖాస్తు చేయాలంటే వివాహమైన తర్వాత కనీసం ఏడాదిపాటు ఆగాలని హిందూ వివాహ చట్టంలోని సెక్షన్‌ 14 సూచిస్తున్నట్లు వెల్లడించింది. 

అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే మినహాయింపు ఉంటుందని సూచించింది. నిశాంత్‌ భరద్వాజ్, రిషికా గౌతమ్‌ అనే దంపతులు పెళ్లయిన సంవత్సరంలోగానే పరస్పర అంగీకారంతో విడాకుల కోసం తొలుత ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. వారి దరఖాస్తును కింది కోర్టు తిరస్కరించడంతో అలహాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విడాకుల కోసం సంవత్సరంలోగా దరఖాస్తు చేయడం చెల్లదని, దాన్ని తాము విచారించబోమని హైకోర్టు వెల్లడించింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement