ధనవంతులకు ఫ్రీ పాస్‌లా..! : హర్ష్‌ గొయెంకా | Sakshi
Sakshi News home page

World Cup Final Match: ధనవంతులకు ఫ్రీ పాస్‌లా..! : హర్ష్‌ గొయెంకా ట్వీట్‌

Published Sun, Nov 19 2023 12:29 PM

Harsh Goenka Sensational Comments On World Cup Final Match Tickets - Sakshi

న్యూఢిల్లీ: దేశమంతా వరల్డ్ కప్‌ ఫైనల్‌ సందడి నడుస్తోంది. సోషల్‌ మీడియా మొత్తం భారత్‌-ఆసీస్‌ మ్యాచ్‌ ఫీవరే కనిపిస్తోంది. ఈ ఫీవర్‌ పరిస్థితుల్లో ప్రముఖ పారిశ్రామిక వేత్త, సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆర్‌పీజీ గ్రూప్‌ అధినేత హర్ష్‌ గొయెంకా చేసిన ట్వీట్‌ వివాదాస్పదమైంది. ట్వీట్‌ను నెటిజన్లు ఆయనకే బూమరాంగ్‌ చేసి రివర్స్‌ ప్రశ్నలేశారు. 

ఇంతకీ హర్ష్‌ గొయెంకా ఏమని ట్వీట్‌ చేశారంటే ‘ ప్రముఖ వ్యాపారస్తులైన నా స్నేహితులెవరూ డబ్బులు చెల్లించి ఫైనల్‌ మ్యాచ్‌ టికెట్లు కొనలేదు. వాళ్లందరూ ఫ్రీ పాస్‌లు తీసుకున్నారు. ఇక్కడ బాధేంటంటే ధనవంతులు డబ్బు చెల్లించడానికి ఇష్టపడకపోవడమే’ అని వ్యాఖ్యానించారు. దీనికి స్పందించిన ఆయన ఫాలోవర్‌ ఒకతను ‘మరి మీ పరిస్థితేంటి సార్‌? టికెటా..పాసా..?’ అని ప్రశ్నించారు. దీనికి స్పందించిన హర్ష్‌ గొయెంకా ఏదీకాదని సమాధానమిచ్చారు.  

అహ్మదాబాద్‌లో జరుగుతున్న వరల్డ్ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ టికెట్లు ఒక్కోటి రూ. 2 లక్షల దాకా ప్రముఖ రీసెల్లింగ్‌ ప్లాట్‌ఫాంలో అమ్ముడవుతున్నాయి. ఈ ప్లాట్‌ఫాంలో టికెట్‌ స్టార్టింగ్‌ ధర 32వేలుండడం విశేషం. భారత్‌, ఆసీస్‌ మధ్య వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది.

Advertisement
Advertisement