Gurugram Man Showering Cash From Running Car - Sakshi
Sakshi News home page

Viral Video: వీడి కథేంటో.. కారు డిక్కీలో కూర్చొని డబ్బులు విసిరేస్తూ..!

Mar 14 2023 7:46 PM | Updated on Mar 14 2023 8:51 PM

Gurugram Man Showering Cash From Running Car  - Sakshi

కొంత మంది బడా బాబులు తమ కూతుళ్లు లేదా కొడుకుల వివాహాలప్పుడూ లేదా ఎన్నికల్లో గెలిచిన డబ్బులను బహిరంగంగా వెదజల్లడం చూస్తుంటాం. అంతేందుకు ఇటీవలే బెంగుళూరులో ఒక వ్యక్తి ఫ్లై ఓవర్‌పై డబ్బులు వెదజల్లి ట్రాఫిక్‌ జామ్‌ అయ్యేలా చేసిన ఉదంతాన్ని కూడా చూశాం. అవన్నీ మరువక మునుపే అచ్చం అలాంటి మరో ఘటన హర్యానాలోని గురుగ్రామ్‌లో చోటు చేసుకుంది.

ఇద్దరు యువకులు కదులుతున్న కారులోంచి కరెన్సీ నోట్లను విసిరారు. ఇటీవలే విడుదలైన ఫర్జీ అనే వెబ్‌సీరిస్‌లోని సీన్‌ మాదిరిగా సీన్‌ని రీ క్రియేట్‌ చేసినట్లుగా చేశారు. ఈ మేరకు ఏసీపీ వికాస్‌ కౌశిక్‌ మాట్లాడుతూ..సదరు యువకులను గుర్తించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వాళ్లు సినిమాలోని సీన్‌ మాదిరిగా చేయడం కోసం ఇలాంటి దుస్సాహాసానికి ఒడిగట్టినట్లు తెలిపారు. ఆ యువకులు గోల్ఫ్‌కోర్సు రోడ్డు వద్ద కరెన్సీని విసిరినట్లు తెలిపారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టడంతో సదరు వ్యక్తులును గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. 

(చదవండి: ట్రైన్‌లో మహిళపై మూత్ర విసర్జన ఘటన:టీసీపై సస్పెన్షన్‌ వేటు)

Advertisement
 
Advertisement
Advertisement