ప్రధాని మోదీ ‘డిగ్రీ’ చూపించాల్సిన అవసరం లేదు.. కేజ్రీవాల్‌కు జరిమానా

Gujarat High Court: PM Modi Degree Need Not be Furnished Fines Kejriwal - Sakshi

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్హతల వ్యవహారంలో గుజరాత్‌ హైకోర్టు శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. మోదీ డిగ్రీ వివరాలను వెల్లడించాలంటూ కేంద్ర సమాచార కమిషన్‌ ఇచ్చిన ఆదేశాలను కొట్టిపారేసింది. మోదీ డిగ్రీ సర్టిఫికేట్లను ప్రధానమంత్రి కార్యాలయం(పీఎమ్‌ఓ) బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అదే విధంగా మోదీ డిగ్రీ  వివరాలడిగిన  ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు రూ.25 వేలు జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని నాలుగు వారాల్లో గుజరాత్‌ రాష్ట్ర లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీలో డిపాజిట్‌ చేయాలని ఆదేశించింది.

కాగా సమాచార హక్కు చట్టం కింద ప్రధాని మోదీ డిగ్రీ, పీజీకి సంబంధించిన సమాచారాన్ని అందించాలని ఢిల్లీ సీఎం 2016లో కేంద్ర సమాచార కమిషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. దీనిని పరిశీలించిన సీఐసీ.. మోదీ డిగ్రీ, పీజీ సర్టిఫికెట్‌లు కేజ్రీవాల్‌కు సమర్పించాలని గుజరాత్‌ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీలతోపాటు పీఎంవో కార్యాలయ పబ్లిక్‌ ఇన్ఫర్‌మేషన్‌ ఆఫీసర్‌(పీఐవో)ను ఆదేశించింది. అయితే సీఐసీ ఆదేశాలను సవాల్‌ చేస్తూ గుజరాత్‌ యూనివర్సిటీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో సీఐసీ ఆదేశాలపై అప్పుడు హైకోర్టు స్టే విధించింది.

ఇటీవల దీనిపై జస్టిస్‌ బీరెన్‌ వైష్ణవ్‌ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం  విచారణ చేపట్టింది. ఈ కేసులో యూనివ‌ర్సిటీ త‌ర‌పున సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా వాదనలు వినిపించారు.  దీంట్లో దాచిపెట్ట‌డానికి ఏమీలేద‌ని, ఆ వివరాలు ఇప్పటికే పబ్లిక్‌ డొమైన్‌లో, యూనివర్శిటీ వెబ్‌సైట్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.  ఈవ ఇషయంలో వ‌ర్సిటీని ఒత్తిడి చేయ‌డం స‌రికాద‌న్నారు. 

‘ప్రజాస్వామ్యంలో పదవిలో ఉన్న వ్యక్తి డాక్టరేట్‌.. లేదా నిరక్షరాస్యుడు అనే తేడా ఉండదు. అంతేగాక ఈ విషయంలో ప్రజా ప్రయోజనం లేదు. ప్రధాని గోప్యతపై ఇది ప్రభావితం చూపుతుంది. ఓ వ్యక్తి బాధ్యతారహితమైన అత్యుత్సాహానికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆర్టీఐ కింద అభ్యర్థించే సమాచారం పబ్లిక్ యాక్టివిటీకి సంబంధించినదిగా ఉండాలి’ అని సొలిసిటర్ జనరల్ వాదించారు.
చదవండి: Mumbai: టికెట్‌ లేని ప్రయాణికులపై రూ.300 కోట్లు వసూలు.. 90% యువతే

ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం నేడు కీలక తీర్పు వెలువరించింది. మోదీ సర్టిఫికెట్లను (Modi Certificates) పీఎంవో గానీ.. యూనివర్శిటీ గానీ చూపించాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. ఈ సందర్భంగా ఆ పత్రాలను కోరిన కేజ్రీవాల్‌కు రూ.25వేల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని నాలుగు వారాల్లోగా గుజరాత్‌ రాష్ట్ర లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీలో జమ చేయాలని ఆదేశించింది. ఈ తీర్పుపై స్టే ఇచ్చేందుకు కూడా కోర్టు నిరాకరించింది. కాగా.. ప్రధాని మోదీ 1978లో గుజరాత్‌ యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌, 1983లో దిల్లీ యూనివర్శిటీ నుంచి పీజీ పూర్తిచేశారు.

అయితే  ఈ వాదనలను కేజ్రీవాల్‌ తరఫు న్యాయవాది ఖండించారు. ఎన్నికల నామినేషన్‌ ఫారమ్‌లో విద్యార్హతలు నమోదు చేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఆ పత్రాలు ఇంటర్నెట్‌లో అందుబాటులో లేవని, ఆధారాల కోసమే వాటి కాపీలను అడుగుతున్నామని తెలిపారు. తాము కేవలం డిగ్రీ సర్టిఫికేట్ అడుగుతున్నామని, మార్కులషీట్ కాదని అన్నారు.

ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం నేడు తీర్పు వెలువరించింది. మోదీ సర్టిఫికెట్లను పీఎంవో గానీ.. యూనివర్శిటీ గానీ చూపించాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. ఈ తీర్పుపై స్టే ఇచ్చేందుకు కూడా కోర్టు నిరాకరించింది. కాగా ఎన్నికల కమిషన్‌కు ప్రధాని ఇచ్చిన స‌మాచారం మేర‌కు.. 1978లో గుజ‌రాత్ యూనివ‌ర్సిటీ నుంచి త‌న గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేశారు. 1983లో ఢిల్లీ యూనివ‌ర్సిటీ నుంచి మోదీ పీజీ పూర్తి చేశారు.

మరిన్ని వార్తలు :

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags:  

Read also in:
Back to Top