తాబేలుకు ఫాదర్స్‌ డే | Guinness World Record for first time father of a tortoise at an old age | Sakshi
Sakshi News home page

తాబేలుకు ఫాదర్స్‌ డే

Jun 16 2025 2:58 AM | Updated on Jun 16 2025 2:58 AM

Guinness World Record for first time father of a tortoise at an old age

135వ ఏట తొలి సంతానం! 

మనకు తెలిసి ఈ భూమ్మీద అత్యంత ఎక్కువ కాలం బతికే జీవి తాబేలు. దాదాపు 300 ఏళ్లు బతుకుతుందని అంచనా. అలాంటి ఓ తాబేలు అమెరికాలోని దక్షిణ ఫ్లోరిడాలో ఉన్న మయామీ జూలో ఓ తాబేలు 135వ బర్త్‌డేను, మొదటి ఫాదర్స్‌డేను కూడా జరుపుకొంది. వృద్ధాప్యంలో మొదటిసారి తండ్రయిన తాబేలుగా గిన్నిస్‌ రికార్డులకూ ఎక్కనుంది. 234 కిలోల బరువున్న గాలాపాగోస్‌కు చెందిన ఈ తాబేలు పేరు గోలియత్‌. ఇది 1890లో జన్మించి ఉంటుందని భావిస్తున్నారు. ఈ జాతి తాబేళ్లు అంతరించిపోతున్న సరీసృపాల్లో ఉన్నాయి. 

గోలియత్‌ను 1929లో బ్రోంక్స్‌ జూకు, ఆ తరువాత 1981లో మయామి జూకు తరలించారు. ఇన్నేళ్ల తరువాత.. స్వీట్‌ పీ అనే వందేళ్ల తాబేలు వల్ల గోలియత్‌కు తండ్రి స్థానం లభించింది. జనవరి 27న స్వీట్‌ పీ ఎనిమిది గుడ్లు పెట్టగా.. 128 రోజులు పొదిగిన తరువాత ఒక్కటి మాత్రమే తాబేలు పిల్లగా మారింది. ఇన్నేళ్లలో గోలియత్‌కు ఇదే తొలి సంతానం కావడం విశేషం! ఈ జూలో మొట్టమొదటి గాలాపాగోస్‌ జాతి తాబేలు పిల్ల కూడా. 

తాబేళ్లు పుట్టుకతోనే స్వతంత్రంగా ఉంటాయని, ఈ తాబేలు పిల్లను ప్రత్యేక స్థలానికి తరలించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇక జూ నిర్వాహకులు ఆదివారం గోలియత్‌ పుట్టిన రోజుతోపా టు, మొదటి ఫాదర్స్‌డేను కూడా నిర్వహించారు. వృద్ధాప్యంలో మొదటి సారి తండ్రయిన తాబేలుగా గోలియత్‌కు గిన్నిస్‌ రికార్డ్‌ కోసం దరఖాస్తు చేసినట్లు జూ నిర్వాహకులు తెలిపారు. 135 ఏళ్లు గోలియిత్‌ రికార్డును కచి్చతంగా సొంతం చేసుకుంటుందని ఆశిస్తూ ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేశారు.      – సాక్షి, నేషనల్‌ డెస్క్‌   

Advertisement
 
Advertisement
Advertisement