జాడ లేని పెళ్లికూతురు.. నిరాశతో తిరిగొచ్చిన పెళ్లికొడుకు | Groom Returns Empty Handed As Bride Vanish | Sakshi
Sakshi News home page

UP: దొరకని పెళ్లి కూతురు ఇల్లు.. షాక్‌లో తిరిగొచ్చిన పెళ్లికొడుకు

Jul 15 2024 10:49 AM | Updated on Jul 15 2024 11:03 AM

Groom Returns Empty Handed As Bride Vanish

లక్నో: పాపం ఓ పెళ్లికొడుకు పెళ్లి చేసుకోవడం కోసం బంధుమిత్రులు, బాజా భజంత్రీలతో పెళ్లి కూతురు ఇంటికి బయలుదేరాడు. ఇక్కడే అతడికి పెద్ద షాక్‌ తగిలింది. వెళ్లినచోట ఎంత వెతికినా పెళ్లికూతురు ఇల్లు దొరకలేదు. పెళ్లి కూతురు, ఆమె అమ్మానాన్నలకు ఫోన్‌ చేస్తే స్విచ్‌ఆఫ్‌ వచ్చింది.

అక్కడ ఇరుగుపొరుగు వాళ్లను అడిగితే అసలు మీరు చెబుతున్నవారెవరు ఇక్కడ ఉండరు అని సమాధానం వచ్చింది. ఇంకేముంది పోలీసులకు ఫిర్యాదు చేసిన పెళ్లికొడుకు నిరాశతో  వెనుదిరిగాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో లక్నోలోని రహీమామాబాద్‌ ప్రాంతంలో ఆదివారం(జులై 14) జరిగింది. ఉన్నావోకు చెందిన సోనూ అనే యువకుడికి  కాజల్‌ అనే అమ్మాయికి చండీగఢ్‌లో పరిచయమైంది. 

వారిద్దరు పెళ్లి చేసుకోవాలని డిసైడయ్యారు. భాజాభజంత్రీలు అన్నీ రెడీ చేసుకుని వస్తే పెళ్లి చేసుకుందాం అని కాజల్‌  సోనూకు ఫోన్‌లో చెప్పింది.  పెళ్లి ఏర్పాట్లు మొత్తం చేసేశామని కాజల్‌ తండ్రి కూడా సోనూకు ఫోన్‌లో చెప్పాడు. ఈ మాటలు నిజమని నమ్మిన సోనూ పెళ్లి చేసుకుందామని వెళ్లి పెళ్లికూతురు ఇల్లు దొరకక షాక్‌లో వెనుదిరిగి వచ్చాడు.                          

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement