లోక్‌సభ స్థానాలు 850కి పెంపు.. కేంద్రం కీలక నిర్ణయం | Govt proposes a bill to increase Lok Sabha seats to 850 | Sakshi
Sakshi News home page

లోక్‌సభ స్థానాలు 850కి పెంపు.. కేంద్రం కీలక నిర్ణయం

Apr 14 2026 4:11 PM | Updated on Apr 14 2026 4:33 PM

Govt proposes a bill to increase Lok Sabha seats to 850

న్యూఢిల్లీ: 131వ రాజ్యాంగ సవరణకు కేంద్రం సిద్ధమైంది. ఇందులో భాగంగా లోక్‌సభ స్థానాలపై కీలక నిర్ణయం తీసుకుంది.లోక్‌సభ స్థానాలను 850కి పెంచాలని ప్రతిపాదించింది. ఇందులో రాష్ట్రాలకు 815, కేంద్ర పాలిత ప్రాంతాలకు 35 స్థానాలు కేటాయించేలా ప్రణాళిక రూపొందించింది. లోక్‌సభ స్థానాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించనుంది. నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం ప్రతిపాదనలను ఎంపీలకు తెలియజేసింది.

ఈ నెల 16 నుంచి 18 వరకు ప్రత్యేక లోక్‌సభ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌పై చర్చ జరగనుంది.

ప్రస్తుతం దేశంలో మొత్తం 543 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. అందులో 530 స్థానాలు రాష్ట్రాలకు, 13 స్థానాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు కేటాయించబడ్డాయి. ఇప్పుడు ఆ మొత్తాన్ని పెంచేలా నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం ప్రతిపాదనలు ఎంపీలకు అందించింది.

Advertisement
 
Advertisement
Advertisement