యూపీ పాఠశాలలో 9 మంది విద్యార్థులకు మంకీపాక్స్.. లక్షణాలివే..! | Sakshi
Sakshi News home page

Chicken pox: యూపీ ప్రభుత్వ పాఠశాలలో 9 మంది విద్యార్థులకు చికెన్‌పాక్స్‌.. లక్షణాలివే..!

Published Sun, Feb 12 2023 5:42 PM

Up Govt Primary School Nine Students Teacher Chickenpox - Sakshi

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ బలియా జిల్లాలో చికెన్‌పాక్స్ కలకలం రేపింది. గోవింద్‌పూర్‌లోని ప్రాథమిక పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు సహా 9 మంది విద్యార్థులు ఈ వ్యాధి బారినపడ్డారు. ఈ విద్యార్థుల్లో కొద్దిరోజుల క్రితం నుంచే చికెన్‌పాక్స్ లక్షణాలు కన్పించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఒంటిపై, మొహంపై దద్దుర్లు వచ్చినట్లు పేర్కొన్నాయి.

వీరందరికీ చికెన్‌పాక్స్ సోకిందనని శుక్రవారం నిర్ధరణ అయినట్లు వైద్యాధికారులు పేర్కొన్నారు. వెంటనే వారికి చికిత్స ప్రారంభించినట్లు చెప్పారు. ఈ వ్యాధి ఇతరులకు సోకకుండా నియంత్రణ చర్యలు చేపట్టినట్లు వివరించారు.

చికెన్‌ పాక్స్‌ లక్షణాలు..
► తీవ్రమైన జ్వరం
► గొంతులో ఇబ్బందిగా అన్పించడం
► ఒళ్లుమొత్తం ఎర్రటి దద్దుర్లు
► తలనొప్పి
► దురద
చదవండి: పెళ్లి దుస్తుల్లో వెళ్లి పరీక్ష రాసిన వధువు.. వీడియో వైరల్..

Advertisement
 
Advertisement
 
Advertisement