అభ్యర్థుల ఎన్నికల ప్రచార వ్యయ పరిమితి పెంపు

Govt hikes poll expenditure limit for candidates - Sakshi

న్యూఢిల్లీ: రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ప్రచార వ్యయ పరిమితిని ఎన్నికల సంఘం పెంచింది. లోక్‌సభ ఎన్నికల అభ్యర్థి ప్రచార వ్యయ పరిమితిని రూ. 70 నుంచి 95 లక్షలకు (పెద్ద రాష్ట్రాల్లోని నియోజకవర్గాలు), రూ. 54 నుంచి 75 లక్షలు (చిన్న రాష్ట్రాల్లోని నియోజకవర్గాలు), అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థి ఎన్నికల ప్రచార వ్యయ పరిమితిని రూ. 28 నుంచి 40 లక్షలకు (పెద్ద రాష్ట్రాల్లోని నియోజకవర్గాలు), రూ. 20 నుంచి 28 లక్షలకు (చిన్న రాష్ట్రాల్లోని నియోజకవర్గాలు) పెంచుతున్నట్లు ఈసీ గురువారం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ ఒక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాబోయే ఎన్నికల నుంచి ఈ నూతన పరిమితులు అమల్లోకి వస్తాయి. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలలో వచ్చే ఫిబ్రవరి– మార్చి నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top