వీటిపై 71 వేల ఫిర్యాదులు అందాయి: గూగుల్‌

Google Removed Over One Lakh Content After Receiving 71148 Complaints In India - Sakshi

న్యూఢిల్లీ: మే, జూన్‌ నెలల్లో భారతీయ వినియోగదారుల నుంచి 71,148 ఫిర్యాదులు అందినట్లు గూగుల్‌ శుక్రవారం వెల్లడించింది. ఆయా ఫిర్యాదుల ఆధారంగా సమాచారంలోని 1.54 లక్షల భాగాలను తొలగించినట్లు తెలిపింది. అందులోనూ జూన్‌ నెలలోనే 36,265 ఫిర్యాదులు అందాయని, వాటి కారణంగా 83,613 తొలగింపు చర్యలను చేపట్టినట్లు పేర్కొంది.

వీటితో పాటు తమ ప్లాట్‌ఫామ్‌లోని ఆటోమేటెడ్‌ డిటెక్షన్‌ పద్ధతి ద్వారా 11.6 లక్షల సమాచార భాగాలను తొలగించినట్లు తెలిపింది. తొలగింపునకు గురైన సమాచారంలో కాపీరైట్‌ (70,365), ట్రేడ్‌ మార్క్‌ (753), కౌంటర్‌ఫీట్‌ (5), లీగల్‌ (4) వ్యవహారాలు ఉన్నాయని గూగుల్‌ చెప్పింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి



 

Read also in:
Back to Top