సాక్షి, న్యూఢిల్లీ: ధూమపానానికి దూరం కావాలనుకునే వారు ఎప్పుడూ ఉంటారు. అయితే వారిలో కొద్ది మందే అందులో విజయం సాధిస్తారు. ప్రపంచ ప్రజలకు వణికిస్తోన్న కోవిడ్ మహమ్మారి బారిన పడిన వారిలో తీవ్ర అస్వస్థతకు గురవుతోన్నది, బాధ పడుతోన్నది ధూమపాన ప్రియులని తేలడంతో ఇప్పుడు వారిలో ఎక్కువ మంది ధూమపానానికి స్వస్తి చెప్పాలనుకుంటున్నారు. అలాంటి వారు విజయం సాధించాలంటే ఇంతకంటే మంచి తరుణం మరోటి ఉండదని వైద్య నిపుణులే చెబుతున్నారు.
కోవిడ్ దండయాత్రకు ముందు ధూమపానానికి దూరం కావాలనుకున్న వారి సంఖ్య అమెరికా, ఆస్ట్రేలియా స్మోకర్లలో పది శాతం మందికాగా, ఇప్పుడు వారి సంఖ్య 19 నుంచి 29 శాతానికి చేరుకున్నట్లు ‘అడిక్షన్ మెడిసిన్’ జర్నల్ తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. ధూమపానానికి స్వస్తి చెప్పడం ద్వారా కోవిడ్ ముప్పుకు దూరం కావాలనుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగానే ఉందని, ధూమపానం వల్ల కలిగే నష్టాల గురించి ఎప్పటికప్పుడు తెలసుకోవాలనుకుంటున్నవారు కూడా తాము అభిప్రాయలు కోరిన స్మోకర్లలో 45 శాతం మంది ఉన్నారని ఆ సర్వే తెలిపింది. ఇలాంటి సమాచారం తెలసుకోవాలనుకుంటోన్న వారిలో ఎక్కువ మంది, అంటే 61 శాతం మంది టీవీ మీడియంనే కోరుకుంటున్నారు. ఇక ఆన్లైన్ మీడియా ద్వారా 36 శాతం మంది, సోషల్ మీడియా ద్వారా 31 శాతం, ఈ మెయిల్ ద్వారా 31 శాతం మంది కోరుకుంటున్నారు.
ధూమపానానికి స్వస్తి చెప్పేందుకు తమకు సహకరించాలని, ఈ విషయంలో నికోటిన్ ప్రత్యామ్నాయ థెరపిని సూచించాలని 61 శాతం స్మోకర్లు కోరుతున్నారని సర్వేలో తేలింది. ధూమపాన వ్యతిరేక ప్రచారం, పొగాకు ఉత్పత్తులపై అధిక పన్నుల విధింపు, పరిమిత ప్రాంతాలకే ధూమపానాన్ని కట్టడి చేసే చట్టాల వల్ల ఆస్ట్రేలియాలో ధూమపాన ప్రియుల సంఖ్య 11 శాతానికి పడిపోంది. ఈ దురలవాటు వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 80 లక్షల మంది మత్యువాత పడుతున్నారు.
ధూమపానం స్వస్తికి ఇదే సరైన తరుణం
Published Thu, Oct 1 2020 6:11 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్‌కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement