ఆరేళ్ల ఆర్నా ప్రపంచ రికార్డు.. విమానం తోక చూసి.. | Girl Bags World Record For Identifying 93 Airlines Tails In Minute | Sakshi
Sakshi News home page

ఆరేళ్ల ఆర్నా ప్రపంచ రికార్డు.. విమానం తోక చూసి..

Jul 11 2021 11:56 AM | Updated on Jul 11 2021 1:51 PM

Girl Bags World Record For Identifying 93 Airlines Tails In Minute - Sakshi

చిన్నారులకు పదేపదే చెబితేగానీ ఎ.బి.సి.డిలు గుర్తుండవు. అటువంటిది ఆరేళ్ల ఆర్నా గుప్తా విమానం తోక చూసి అది ఏ దేశానికి చెందినదో ఇట్టే చెప్పేస్తుంది. నిమిషంలో 93 దేశాలకు చెందిన విమానాలను గుర్తించి ‘అంతర్జాతీయ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో చోటు దక్కించుకుంది. హర్యాణాలోని పంచకులకు చెందిన ఆర్నా ఏదైనా ఒక్కసారి చూసినా, విన్నా వెంటనే తన మెదడు లో నిక్షిప్తం చేసుకుంటుంది.

వాటి గురించి ఎప్పుడు అడిగినా టక్కున చెప్పేస్తుంది. రెండేళ్ల  వయసునుంచే ఆర్నా చెప్పిన ప్రతివిషయాన్ని ఆపోశన పట్టేస్తుంది. ఇది గమనించిన ఆర్నా తల్లి నేహా గుప్తా.. ఆర్నాను ప్రోత్సహించారు. దీంతో ఈ రోజు ఆర్నా ప్రపంచ రికార్డును సాధించింది. గతేడాది ఆగస్టులో 120 మంది ప్రముఖుల పేర్లను 92 సెకన్లలో చెప్పి రికార్డు సృష్టించింది.  

Advertisement
 
Advertisement
Advertisement