14 రోజుల్లో ఆజాద్‌ కొత్త పార్టీ ప్రారంభం... ఊహించని ఝలక్‌

Ghulam Nabi Azad All Set To Launch His Own Party In 14 Days - Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ మాజీ నాయకుడు గులాం నబీ ఆజాద్‌ శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీ అన్ని సభ్యుత్వాలకు రాజీనామ చేస్తున్నట్లు ప్రకటించిన కొద్దిగంటల్లోనే కొత్తపార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆజాద్‌ 14 రోజుల్లోనే కొత్త పార్టీ తొలి యునిట్‌ను జమ్ము కశ్మీర్‌ ఏర్పాటు చేయుబోతున్నారని ఆయన సన్నిహితుడు ప్రముఖ కాంగ్రెస్‌ నాయకుడు, మాజీ మంత్రి జీఎం సరూరి తెలిపారు. సైద్ధాంతికంగా లౌకికవాది అయిన ఆజాద్‌ ఆదేశానుసారం పనిచేసే ప్రశ్నే లేదని నొక్కి చెప్పారు.

కాంగ్రెస్‌ మాజీ నాయకుడు, జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి అయిన ఆజాద్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడటంతో వందలాది మంది సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు, పంచాయతీ రాజ్‌ సంస్థల సభ్యులు, ప్రముఖులు కూడా తమ రాజనామాను సమర్పిచినట్లు పేర్కొన్నారు. అంతేకాద మా కొత్త పార్టీని ప్రారంభించేందుకు సెప్టెంబర్ 4న అజాద్‌ జమ్మ కశ్మీర్‌కి వస్తున్నారని అన్నారు. అదీగాక ఆజాద్‌ కూడా తాను కొత్త జాతీయ పార్టీని ప్రారంభించే తొందరలో లేనని, జమ్ము కశ్మీర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు.

ఐతే సరూరి జమ్ముకశ్మీర్‌కి అజాద్‌ తిరిగి వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఆయన జమ్ముకశ్మీర్‌లో నవంబర్‌ 2, 2005 నుంచి జూలై11, 2008 వరకు ముఖ్యమంత్రిగా సేవలందించారు, పైగా ఆయన పాలనను ప్రజలు స్వర్ణయుగంగా చూస్తారని చెప్పారు. తమ కొత్తపార్టీ ఆగస్టు 5, 2019కి ముందు ఉన్న జమ్ము కశ్మర్‌‌ పూర్వవైభవాన్ని పునరుద్ధరించడం కోసమే పోరాడుతుందని చెప్పారు. అలాగే ఆజాద్‌కి మద్దతుగా పలువురు మాజీ మంత్రులు, శాసనసభ్యులతో సహా డజనుకు పైగా నాయకులు కాంగ్రెస్‌ ప్రాథమిక సభ్యుత్వానికి రాజీనామా చేశారని తెలిపారు. అంతేగాక మాజీ ఉప ముఖ్యమంత్రి తారా చంద్‌ వంటి పలువురు ఈ రోజు ఢిల్లీలో ఆజాద్‌తో సమావేశమై రాజీనామ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. 

(చదవండి: కాంగ్రెస్‌కు ఆజాద్‌ గుడ్‌బై)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top