‘రాహుల్‌’ పరిణామాలను గమనిస్తున్నాం | Germany takes note of Rahul Gandhi disqualification | Sakshi
Sakshi News home page

‘రాహుల్‌’ పరిణామాలను గమనిస్తున్నాం

Mar 31 2023 5:52 AM | Updated on Mar 31 2023 5:52 AM

Germany takes note of Rahul Gandhi disqualification - Sakshi

న్యూఢిల్లీ: రాహుల్‌ గాంధీ లోక్‌సభ సభ్యత్వం రద్దుపై అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ మధ్య కొనసాగుతున్న రగడ ముదిరింది. ‘ రాహుల్‌కి  వ్యతిరేకంగా కోర్టు తీర్పు, అనర్హత వేటు తదనంతర పరిణామాలను గమనిస్తున్నాం. లోక్‌సభ సభ్యత్వం రద్దు చేయడం సమంజసమేనా? అనేది పై కోర్టులో తేలుతుంది’ అని జర్మనీ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఒకరు మీడియాతో అన్నారు. దీనికి కాంగ్రెస్‌ నేతలు కృతజ్ఞతలు తెలిపారు.

దీనిపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మన దేశ అంతర్గత వ్యవహారాల్లోకి విదేశీ శక్తులను కాంగ్రెస్‌ ఆహ్వానిస్తోందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు ట్వీట్‌చేశారు. ఈ ట్వీట్‌పై కాంగ్రెస్‌ నేత పవన్‌ ఖేరా స్పందించారు. ‘ అసలైన వ్యవహారాన్ని ఎందుకు పక్కదారి పట్టిస్తున్నారు? అదానీపై రాహుల్‌ లేవనెత్తిన ప్రశ్నలకు ప్రధాని సమాధానం ఇవ్వడంలేదు. ప్రజల దృష్టిని మళ్లించడం కాదు, మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి’’ అని డిమాండ్‌ చేశారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement