గీతా ప్రెస్ ట్రస్టీ బైజ్‌నాథ్ అగర్వాల్ కన్నుమూత! | Sakshi
Sakshi News home page

Baijnath Agarwal Passes Away: గీతా ప్రెస్ ట్రస్టీ బైజ్‌నాథ్ అగర్వాల్ కన్నుమూత!

Published Sat, Oct 28 2023 11:44 AM

Geeta Press Gorakhpur Trustee Baijnath Agarwal Passes Away - Sakshi

గీతా ప్రెస్ ట్రస్టీ బైజ్‌నాథ్ అగర్వాల్ (90) కన్నుమూశారు. ఆయన 1950లో ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో గల గీతా ప్రెస్ ట్రస్ట్‌లో చేరారు. నగరంలోని సివిల్ లైన్స్‌లో గల హరిఓమ్‌నగర్ నివాసంలో ఉంటున్న బైజ్‌నాథ్ అగర్వాల్ శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు. 

బైజ్‌నాథ్ అగర్వాల్ మృతిపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన తన ట్విట్టర్‌(ఎక్స్‌) ఖాతాలోలో ఇలా రాశారు.. ‘గోరఖ్‌పూర్‌లోని గీతా ప్రెస్ ట్రస్టీ బైజ్‌నాథ్ అగర్వాల్ మరణం విచారకరం. గత 40 సంవత్సరాలుగా గీతా ప్రెస్‌కు ధర్మకర్తగా బైజ్‌నాథ్ వ్యవహరించారు. ఆయన జీవితం ప్రజా సంక్షేమానికే అంకితమయ్యింది. శ్రీరాముడు తన పాదాల చెంత ఆయన ఆత్మకు చోటు కల్పించాలని వేడుకుంటున్నానని’ అన్నారు. 
ఇది కూడా చదవండి: దేశంలో వీధి కుక్కలు ఎన్ని? కుక్క కాటు కేసులు ఎక్కడ అధికం?
 

Advertisement
 
Advertisement