రైలు పట్టాలపై సిలిండర్, స్టవ్‌ | gas cylinder on railway track delays trains | Sakshi
Sakshi News home page

రైలు పట్టాలపై సిలిండర్, స్టవ్‌

Apr 15 2026 1:18 PM | Updated on Apr 15 2026 1:47 PM

gas cylinder on railway track delays trains

బెంగళూరు: రైలు పట్టాలపై గ్యాస్‌ సిలిండర్, స్టవ్‌ కనిపించడంతో పలు రైళ్లు ఆలస్యమయ్యాయి. మద్దూరు–చెన్నపట్టణ రైల్వే మార్గంలో ఇది జరిగింది. సోమవారం ఉదయం ఖాళీ గ్యాస్‌ సిలిండర్, గ్యాస్‌ స్టవ్, కొన్ని బట్టలు కలిగిన మూట ఒకటి రైలు పట్టాల ఉంది. మైసూరు నుంచి బెంగళూరు వస్తున్న మంగళ ఎక్స్‌ప్రెస్‌ రైలు లోకోపైలట్‌ వాటిని చూసి రైలును నిలిపివేశాడు. రైలులో ప్రయాణికులు తీసుకువెళ్తున్న ఈ వస్తువులు అనుకోకుండా జారిపడి ఉంటాయని అనుమానిస్తున్నారు. లేదా ఎవరైనా కావాలనే సిలిండర్‌ను పట్టాలపై ఉంచారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన వల్ల కొన్ని రైళ్లు ఆలస్యంగా నడిచాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement