ఎంతకు అమ్ముడుపోయావ్‌.. సాయిని ఘోష్‌కు నిరసన సెగ | gaddar beimaan chants greet rebel tmc mp saayoni ghosh during visit to baruipur victim | Sakshi
Sakshi News home page

ఎంతకు అమ్ముడుపోయావ్‌.. సాయిని ఘోష్‌కు నిరసన సెగ

Jul 7 2026 11:02 PM | Updated on Jul 7 2026 11:02 PM

gaddar beimaan chants greet rebel tmc mp saayoni ghosh during visit to baruipur victim

కోల్‌కతా: ఎంపీ సాయిని ఘోష్‌కు నిరసన సెగ తగిలింది. పశ్చిమబెంగాల్‌లో  బారుయిపూర్‌లో 12 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం, హత్యకు గురైంది. ఈ  ఘటనలో బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన ఎంపీ సాయోని ఘోష్‌కు అక్కడి స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఆమెను చూసి జనాలు తీవ్ర స్థాయిలో నిరసన చేశారు. ఎంతకు అమ్ముడుపోయావ్‌ అంటూ నినాదాలు చేశారు.

ఇటీవల తృణముల్ కాంగ్రెస్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. లోక్‌సభలో తృణమూల్ కాంగ్రెస్‌ ఎంపీ కాకొలి ఘోష్ దస్తీదార్ నేతృత్వంలో  20 మంది ఎంపీలు ఒకేసారి తిరుగుబాటు చేసి పార్టీ నుండి విడిపోయారు. NCPI లో విలీనమయ్యారు. ఈ విలీన పత్రాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు అధికారికంగా సమర్పించి, పార్లమెంట్‌లో తమకు టిఎంసితో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని కోరారు. ఈపార్టీ కేంద్రంలోని బిజెపి నేతృత్వంలోని NDA కూటమికి మద్దతు ఇస్తోంది. అందులో సాయిని ఘోష్‌ సైతం ఉన్నారు. తాజాగా ఆమెకు నిరసన సెగ తగిలింది.

బాధిత కుటుంబానికి పరామర్శించడానికి వెళ్లగానే అక్కడి గుంపులోని కొంతమంది "గద్దార్" (ద్రోహి), "బేఇమాన్" (నమ్మకద్రోహి) అంటూ నినాదాలు చేశారు. "నువ్వు ఎంతకు అమ్ముడుపోయావు అంటూ అరిచారు.ఆమెను "అవకాశవాది" అని పిలుస్తూ  పెద్దఎత్తున విమర్శలు చేశారు. దీంతో పోలీసులు వారికి ప్రత్యేక భద్రత కల్పించి అక్కడి నుండి తీసుకెళ్లారు. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

అయితే ఈ నిరసనలపై స్పందించిన సాయిని ఘోష్ ఇలాంటి నేరాలు జరిగినప్పుడు ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనే దానిపైనే దృష్టి పెట్టడం ముఖ్యమని అన్నారు. ఈ ఘోరం తనను తీవ్రంగా కలచివేసిందని ఆమె అన్నారు. బాధిత కుటుంబానికి మేము అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చాము, అని చెబుతూ, నిందితులకు కఠినమైన శిక్ష విధించాలని ఆమె డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement