Kalyan Singh: క్షీణించిన మాజీ సీఎం ఆరోగ్యం | Former Uttar Pradesh CM Kalyan Singh Remains Critical | Sakshi
Sakshi News home page

Kalyan Singh: క్షీణించిన మాజీ సీఎం ఆరోగ్యం

Jul 22 2021 12:56 AM | Updated on Jul 22 2021 1:45 AM

Former Uttar Pradesh CM Kalyan Singh Remains Critical - Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం కల్యాణ్‌ సింగ్‌ (89) ఆరోగ్యం మరింత క్షీణించింది. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారని సంజయ్‌ గాంధీ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎస్‌జీపీజీఐఎంఎస్‌) బుధ వారం వెల్లడించింది. మంగళవారం సాయం త్రం నుంచి ఆయన వెంటిలేటర్‌ మీదనే ఉన్నా డని చెప్పింది. ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని తెలిపింది.

కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, ఎండోక్రైనోలజీ విభాగాలకు చెం దిన నిపుణులు నిరంతరం ఆయన్ను పరిశీ లిస్తున్నారని ఆస్పత్రి వెల్లడించింది. ఇదిలా ఉం డగా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆస్ప త్రిని సందర్శించారు. కల్యాణ్‌ సింగ్‌ ఆరో గ్యం గురించి వాకబు చేసినట్లు ఆయన తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా వెల్లడించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలి పారు. 

Advertisement
 
Advertisement
Advertisement