చిరుత, కొండచిలువ ఫైట్‌.. గెలిచిందెవరో

Fight Between Leopard And Python Video Goes Viral - Sakshi

చిరుతపులి.. తన పంజాతో ఎంతంటి జంతువునైనా ఇట్టే చీల్చిపారేయగల జంతువు. కొండచిలువ.. తన బలమైన శరీరంతో చుట్టేసి ఊపిరిఆడకుండా చేయగలదు. పెద్ద జంతువునైనా అమాంతం మింగేయగలదు కూడా. ఈ రెండు శక్తివంతమైన జీవులే. అలాంటిది ఈ రెండు జీవులు కొట్లాడితే ఎలా ఉంటుంది? నున్వా నేనా అన్నట్లు తలపడితే చూస్తూ భయపడకుండా ఉండగలమా? అలాంటి వీడియోలు చాలా అరుదుగా కనిపిస్తాయి.
(చదవండి : ఒక్క వీడియో జీవితాన్ని మార్చేసింది)

చిరుతపులి, కొండచిలువ మధ్య ఉత్కంఠభరితంగా సాగిన పోరాటానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 49 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో పైథాన్‌పై చిరుతపులి తెలివిగా దాడి చేస్తుంది. నెమ్మదిగా ముందుకు వెళ్లి దాని మెడభాగాన్ని నోటితో పట్టేస్తుంది. అది దానిని చుట్టుకునేందుకు ప్రయత్నించగా..చిరుత తప్పించుకుంటూ కొండచిలువను లాక్కుంటూ తీసుకెళ్లుంది. మొత్తంగా చిరుత తెలివిగా కొండచిలువను చంపేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఒళ్లు గగుర్పొడిచే వీడియో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
(చదవండి: వైరల్‌: తల్లిని కాపాడేందుకు ఐదేళ్ల పిల్లాడు..)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top