తుది దశకు మావోయిస్టులపై పోరు | Sakshi
Sakshi News home page

తుది దశకు మావోయిస్టులపై పోరు

Published Sun, Mar 26 2023 4:32 AM

Fight against Maoist insurgency in final phase - Sakshi

జగదల్‌పూర్‌: దేశంలో వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా జరుగుతోన్న పోరాటం తుది దశకు చేరుకుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా చెప్పారు. రేపో మాపో ఈ పోరాటంలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.  సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది చేస్తున్న ఆత్మత్యాగాలే ఈ పోరాటంలో అత్యంత కీలకమని వ్యాఖ్యానించారు.

సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీసు ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌) 84వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో అమిత్‌ షా మాట్లాడుతూ గత తొమ్మిదేళ్లుగా నక్సలిజంపై భద్రతా సిబ్బంది పోరాటం చేస్తున్నారని విజయం సాధించే దిశగా ముందడుగు వేశారని అన్నారు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ఎదురయ్యే అడ్డంకుల్ని అధిగమించడంలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల పాత్ర ప్రశంసనీయమని కితాబునిచ్చారు.

Advertisement
 
Advertisement
 
Advertisement