తండ్రి ఇంటర్నెట్‌ బ్యాలెన్స్‌ వేయించలేదని..

Father Fails To Recharge Phone Data Pack Son Dies - Sakshi

తండ్రి ఇంటర్నెట్‌ బ్యాలెన్స్‌ వేయించలేదన్న కోపంతో ఓ కొడుకు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌ జబల్‌పూర్‌ జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది. 

కూలీ పనులు చేసుకునే ఆ తండ్రికి.. కుటుంబానికి సరైన తిండి పెట్టడమే కష్టంగా మారింది. ఈ తరుణంలో.. ఫోన్‌ విలాసానికి అలవాటు పడ్డ ఆ కొడుకు డేటా ప్యాక్‌ వేయించమని తండ్రిని కోరాడు. అందుకు తండ్రి ఒప్పుకోకపోవడంతో సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

మొబైల్‌ ఫోన్‌లో గేమ్‌లకు అలవాటు పడ్డ ఆ కుర్రాడు.. తండ్రి ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోలేకపోయాడని, పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఓ కంట కనిపెట్టుకుంటూ ఉండాలని సిటీ సూపరిండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ అలోక్‌ శర్మ సూచిస్తున్నారు.   

మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. బలవన్మరణం మహా పాపం. పైగా అది సమస్యలకు పరిష్కారం కాదు. జీవితం అంటే.. మనం బతికి నలుగురిని బతికించేదిలా ఉండాలి. అందుకే ఆత్మహత్య ఆలోచనలు వస్తే.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు:
040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top