#ResignModi బ్లాక్‌: కేంద్రం ఒత్తిడి లేదని చెప్పిన ఫేస్‌బుక్‌

Facebook Restores Hashtag Indian Prime Minister Modi Resign - Sakshi

#ResignModi.. పొర‌పాటున బ్లాక్ చేశాం.. ప్ర‌భుత్వం చెప్ప‌లేద‌న్న ఫేస్‌బుక్‌

న్యూఢిల్లీ: సోష‌ల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ఓ వివాదంలో చిక్కుకుంది. ఇటీవల ఫేస్‌బుక్‌లో న‌డుస్తున్న ఓ హ్యాష్‌ట్యాగ్‌ను ఆ సంస్థ తాత్కాలికంగా తొల‌గించ‌డ‌మే దీనికి కార‌ణం. ఫేస్‌బుక్‌లో కొన్ని రోజులుగా #ResignModi అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతోంది. భారత్‌లో క‌రోనా సెకండ్ వేవ్‌ను ఊహించ‌డంలో కేం‍ద్ర ప్రభుత్వం  పూర్తిగా విఫ‌ల‌మ‌వ‌డమే గాక ఆక్సిజ‌న్ సిలిండర్లు, బెడ్ల వంటి క‌నీస వైద్య స‌దుపాయాలను కరోనా రోగులకు అందించ‌లేక పోయింది. దీనంతటికీ  నైతిక బాధ్యత వహిస్తూ ప్ర‌ధాని మోదీ తన ప‌ద‌వి నుంచి దిగిపోవాలంటూ నెటిజ‌న్లు ఈ హ్యాష్‌ట్యాగ్‌ను వైర‌ల్ చేశారు. 

కేంద్రం పూర్తిగా విఫలమైంది: నెటిజన్ల మండిపాటు
అయితే ఈ హ్యాష్‌ట్యాగ్‌తో ఉన్న పోస్టుల‌ను ఫేస్‌బుక్ తాత్కాలికంగా బ్లాక్ చేసింది. దీనిపై పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్తం కావ‌డంతో కొన్ని గంట‌ల తర్వాత #ResignModi హ్యాష్‌ట్యాగ్‌ని మ‌ళ్లీ రీస్టోర్ చేసింది. కేంద్ర ప్ర‌భుత్వం ఒత్తిడి వల్లే ఈ హ్యాష్‌ట్యాగ్‌ను ఫేస్‌బుక్ తొల‌గించింద‌న్న విమ‌ర్శ‌లు వస్తున్నాయి. ఈ విషయంపై స్పందిస్తూ ఆ సంస్థ వివ‌ర‌ణ ఇచ్చింది. ఈ హ్యాష్‌ట్యాగ్‌  తాత్కాలికంగా బ్లాక్‌ అయ్యింది‍. పొరపాటు వల్లే ఇలా జరిగింది తప్ప భారత ప్రభుత్వం ప్రమేయమేమీ లేదని ఫేస్‌బుక్‌ కమ్యూనికేషన్ల విభాగ అధికారి ఆండీ స్టోన్ బుధవారం సాయంత్రం ఒక ఇమెయిల్ ప్రకటనలో స్పష్టం చేశారు.

‘ప్రస్తుతం ఈ హ్యాష్‌ట్యాగ్‌ను రిస్టోర్‌ చేశాము, అలాగే  బ్లాక్‌ కు గల కారణాలను పరిశీలిస్తున్నామం’అని  స్టోన్  ట్విటర్‌లోనూ పేర్కొన్నారు. #ResignModi తో ఉన్న పోస్ట్‌లలో కొన్ని కంటెంట్ పరంగా ఫేస్‌బుక్‌ ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్నాయని ఈ సందర్భంగా ఆండీ స్టోన్ తెలిపారు. ఇదిలాఉండగా.. దేశంలో కోవిడ్ సంక్షోభం నేప‌థ్యంలో ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో కొన్ని ఫేక్‌ వార్తలు చక్కర్లు కొడుతూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఈ కారణంగా సోషల్‌ మీడియాలోని కంటెంట్‌పై ఆంక్ష‌ల దిశగా కేంద్రం చర్యలు చేపట్టింది. ప్ర‌స్తుతం సెకండ్ వేవ్ దేశాన్ని అత‌లాకుత‌లం చేస్తున్న విష‌యం తెలిసిందే. రోజుకు 3 లక్ష‌ల‌కుపైగా కోవిడ్‌ కేసులు న‌మోదువుతున్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య ఏకంగా 30 ల‌క్ష‌లు దాటింది.
( చదవండి: కేంద్రం గాలికొదిలేసింది.. ప్రియాంక భావోద్వేగ పోస్ట్‌! )

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top