డ్రగ్స్‌ నేరగాళ్లకు జైలే గతి

Every Drug Trafficker Will Be Behind Bars Within Two Years - Sakshi

లోక్‌సభలో కేంద్ర హోం మంత్రి షా  

న్యూఢిల్లీ:   మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో భాగస్వాములైన బడా నేరగాళ్లను రాబోయే రెండేళ్లలో కచ్చితంగా జైలుకు తరలిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తేల్చిచెప్పారు. డ్రగ్స్‌ దందాలో సంపాదించిన డబ్బును దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. ఈ పాపపు సొమ్ము దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా తయారవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్‌ సమస్యపై బుధవారం లోక్‌సభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో అమిత్‌ షా మాట్లాడారు.

మాదక ద్రవ్యాల కట్టడికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నామన్నారు. డ్రగ్స్‌ వ్యాపారం చేసేవారిపై కేసుల నమోదు అధికారాన్ని బీఎస్‌ఎఫ్, సీమా సురక్షాబల్, అస్సాం రైఫిల్స్‌కు కట్టబెట్టామని అమిత్‌ షా గుర్తుచేశారు. ఈ అంశాన్ని రాజకీయం చేయొద్దని కోరారు. 2014 నుంచి 2022 వరకూ రూ.97,000 కోట్ల విలువైన డ్రగ్స్‌ను ధ్వంసం చేసినట్లు తెలిపారు. 2006 నుంచి 2013 దాకా రూ.23,000 కోట్ల విలువైన సరుకును స్వాధీనం చేసుకుందని వెల్లడించారు.

మరిన్ని వార్తలు :

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top