ఒంటెతో ఏనుగు జలకాలాట.. వీడియో వైరల్‌ | Elephant Sprays Water On Camel With Its Trunk Video Viral | Sakshi
Sakshi News home page

ఒంటెకు స్నానం చేయించిన ఏనుగు.. వీడియో వైరల్‌

Oct 8 2020 4:13 PM | Updated on Oct 8 2020 4:28 PM

Elephant Sprays Water On Camel With Its Trunk Video Viral - Sakshi

సాధారణంగా మూడ్‌ బాగాలేకపోతే పార్క్‌ లేదా జూపార్కులకు వెళ్తుంటాం. అక్కడి పచ్పదనం, పక్షుల కిలకిలలు, జంతువు అరుపులను వింటే మనసు కుదుట పడుతోంది. ఇక కొన్ని కొన్ని జంతువులు చేసే చిలిపి పనులు చూస్తే ఎన్ని బాధలు ఉన్నా ఇట్టే మర్చిపోతాం.  కొన్ని జంతువులు అప్పుడప్పుడు మనుషుల కంటే ఎక్కువ తెలివిని ప్రదర్శిస్తుంటాయి. ఆ వీడియోలను చూస్తే మనస్సుకు ఏదో తెలియని అనుభూతి కలుగుతోంది. అలాంటి వీడియోనే ఇది. ఓ గున్న  ఏనుగు ఏకంగా ఒంటెకు స్నానం చేయింది. ‘అయ్యో ఇంకా స్నానం చేయలేదా.. ఆగు నేను నీకు స్నానం చేయిస్తా’అన్నట్లు పక్కన ఉన్న కాలువలోని నీటిని తొండంతో తీసుకొచ్చి ఒంటె మూపురాలపై చిమ్మేసింది.
(చదవండి : సోషల్ మీడియానా మజాకా: వైరల్ వీడియో)

ఐఎఫ్ఎస్ అధికారి సుశాంతా నందా ఈ వీడియోను ట్వీట్ చేశారు. ఒంటెను చల్లబడడానికి ఏనుగు అలా చేసిందని క్యాప్షన్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఏగును సరదాగా చేసిన ఆ పనికి నెటిజన్లు ఫిదా అయ్యారు. ‘ఫ్రెండ్‌షిప్‌ అంటే ఇదేనేమో’, ‘ఇతరులు విజ్ఞప్తి చేయకముందే జంతువులు సహాయం చేస్తుంటాయి’, ఒంటెతో ఏనుగు ఆడుకుంటుంది’అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా, మొత్తానికి ఈ వీడియో భలే నవ్విస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement