‘ఈసీఐనెట్’తో ఇక సరైన సమాచారం లభ్యం
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ గురువారం కొత్త యాప్ ‘ఈసీఐనెట్’ను ప్రారంభించారు. ఓటర్లు, అధికారులు, రాజకీయ పార్టీలకు సరైన సమాచారం అందించడానికే ఈ యాప్‌ను తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు. దీంతో తప్పుడు సమాచారాన్ని తిప్పికొట్టడానికి వీలవుతుందన్నారు. ఎన్నికల వ్యవస్థపై ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఆయన మాట్లా డారు. ఇలాంటి యాప్‌ను తయారు చేసుకోవడానికి ఇతర దేశాల ఎన్నికల సంఘాలకు సహకరిస్తామని చెప్పారు. వారి చట్టాల ప్రకారం, వారి భాషల్లోనే యాప్‌ను రూపొందించుకోవచ్చని సూచించారు.
ఎన్నికల సంఘానికి సంబంధించి ప్రస్తుతం 40కిపై గా మొబైల్, వెబ్ అప్లికేషన్లు ఉన్నాయి. వీటన్నింటికీ ఒకే గొడుగు కిందకు తీసుకొస్తూ ‘ఈసీ ఐనెట్’ యాప్‌ను అభివృద్ధి చేశారు. ఎన్నికలకు సంబంధించిన అన్ని రకాల కార్యకలా పాల సమా చారం ఇందులో ఉంటుంది. వేర్వేరు యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకొనే అవసరం ఇకపై ఉండదు. కొత్త యాప్‌తో ఓటర్ల డేటాను సులువుగా తెలుసు కోవచ్చు. ఓటర్ హెల్ప్‌లైన్ యాప్, ఓటర్ టర్నౌట్ యాప్, సీవిజిల్, సువిధ, సాక్ష్యం, కేవైసీ వంటి యాప్‌లను ఎన్నికల సంఘం ఉపసంహరించుకుంది.


