నేపాల్‌లో భూకంపం

Earthquake of magnitude 5. 9 strikes Nepal - Sakshi

న్యూఢిల్లీ: నేపాల్‌లో మంగళవారం మధ్యాహ్నం రిక్టర్‌ స్కేల్‌పై 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ ప్రభావంతో ఢిల్లీతోపాటు రాజస్తాన్‌లోని జైపూర్‌లో ప్రకంపనలు సంభవించాయి. నేపాల్‌లోని సుదూర్‌ పశ్చిమ్‌ ప్రావిన్స్‌లోని బజురా జిల్లాలో భూకంప కేంద్రం ఉందని నేపాల్‌ అధికారులు చెప్పారు.

భూకంపం ధాడికి కొండపై నుంచి బండరాయి దొర్లుకుంటూ వచ్చి మీదపడగా ఒక మహిళ చనిపోయింది. రెండిళ్లు కూలిపోగా, పలు ఇళ్లకు, ఒక ఆలయానికి పగుళ్లు వచ్చాయి. కొండచరియలు విరిగిపడి ఒకరు గాయపడగా, 40 గొర్రెలు చనిపోయాయి. ప్రకంపనలతో భయాందోళనలకు గురయ్యామని నోయిడా, ఢిల్లీ వాసులు చెప్పారు. ఆస్తి, ప్రాణనష్టం సంభవించినట్లు ఎటువంటి సమాచారం లేదు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top