వామ్మో.. ఇలా వచ్చి, అలా తన్నుకుపోయింది!

Eagle Catch The Deer In Rajastan Forest - Sakshi

జైపూర్‌: గద్దలా తన్నుకుపోవడం అని చాలాసార్లు అంటుంటాం.. వింటుంటాం కూడా.. కానీ ఎప్పుడైనా చూశారా.. ఇదిగో ఇప్పుడు చూసేయండి.. ఈ స్టెప్పీ జాతికి చెందిన గద్ద వేటాడటంలో మంచి నేర్పరులు.. టార్గెట్‌ మిస్‌కావు..ఆ అడవిలో పాపం ఒక జింక పిల్ల తన తల్లినుంచి తప్పిపోయినట్టుంది. అయితే..ఆకాశం నుంచి ఒక గద్ద ఆ పిల్ల జింకను గమనించింది. వెంటనే ఆమాంతం కిందకు వచ్చి ఒక్క ఉదుటున జింక పిల్లను వాటి పదునైన కాలితో పట్టుకోని వెళ్లిపోయింది.

అయితే, ఈ సంఘటన  రాజస్తాన్‌లోని తాల్‌ చప్పర్‌ అభయారణ్యంలో చోటుచేసుకుంది. దీన్ని బైజూ పాటిల్‌ అనే ఫొటోగ్రాఫర్‌ క్లిక్‌ మనిపించాడు. ఇంతకీ ఈ కృష్ణ జింక పిల్ల సంగతేమైందంటారా? ముందే చెప్పాంగా.. అవి టార్గెట్‌ మిస్‌ కావని.. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top