ప్రయాణీకులకు షాక్‌: విమాన ఛార్జీలు పెంపు

Domestic Flights To Cost 15 Percent More From June 1st - Sakshi

జూన్‌ 1వ తేదీ నుంచి కొత్త ఛార్జీలు

సాక్షి, హైదరాబాద్‌: విమానయాన ధరలు జూన్‌ 1వ తేదీ నుంచి పెరగనున్నాయి. ఈ మేరకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. సంస్థలు తమ ఛార్జీల పట్టికలో మార్పులు చేస్తున్నాయి. విమానయాన కనీస ఛార్జీలు 13 నుంచి 16 శాతానికి పెరుగుతున్నాయి. 40 నిమిషాల ప్రయాణ ఛార్జీ రూ.2,300 నుంచి రూ.2,600కు ఉండనుంది. 60 నిమిషాల ప్రయాణ ఛార్జీ రూ.2,900 నుంచి రూ.3,300కు పెరగనుంది.

కరోనా రెండో దశ విజృంభణతో విమానయాన రంగానికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ క్రమంలోనే విమానయాన రంగానికి ఊతమిచ్చేలా మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. గతేడాది దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌.. ఈ ఏడాది మార్చి నుంచి విమానయాన సేవలు అంతంత మాత్రమే కొనసాగాయి. అంతర్జాతీయంగా కూడా ప్రతికూల వాతావరణం ఉండడంతో విమానయాన రంగం తీవ్రంగా నష్టపోయింది. ఛార్జీల పెంపు ఇలా..

కనీస ఛార్జీలు 13 నుంచి 16 శాతానికి పెంపు
40 నిమిషాల ప్రయాణం: రూ.2,600కు పెంపు..అత్యధిక ధర రూ.7,800
60 నిమిషాల ప్రయాణం: రూ.3,300కు పెంపు... అత్యధిక ధర రూ.9,800

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top