విద్వేష ప్రసంగాలపై సీజేఐకి 76 మంది లాయర్ల లేఖ | Dharam Sansad row: 76 Supreme Court lawyers write to CJI | Sakshi
Sakshi News home page

విద్వేష ప్రసంగాలపై సీజేఐకి 76 మంది లాయర్ల లేఖ

Dec 28 2021 6:03 AM | Updated on Dec 28 2021 6:03 AM

Dharam Sansad row: 76 Supreme Court lawyers write to CJI - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ, హరిద్వార్‌లలో ఇటీవల జరిగిన ధర్మసంసద్‌ల సందర్భంగా పలువురి విద్వేషపూరిత ప్రసంగాలపై సుమోటోగా కేసు నమోదు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)జస్టిస్‌ ఎన్‌వీ రమణకు 75మంది న్యాయవాదులు లేఖ రాశారు. ఆయా కార్యక్రమాల్లో ప్రసంగించిన వారు సమాజంలో విద్వేషాలను ప్రేరేపించడమే కాదు, ఒక మతానికి చెందిన వారందరినీ చంపేయాలని బహిరంగంగా పిలుపునిచ్చారని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి ప్రసంగాలు దేశ సమగ్రత, ఐక్యతలకు గొడ్డలిపెట్టుగా మారడమే కాదు, లక్షలాది ముస్లిం పౌరుల జీవితాలను ప్రమాదంలో పడవేశాయన్నారు. ఈ లేఖపై సంతకాలు చేసిన వారిలో సీనియర్‌ లాయర్లు సల్మాన్‌ ఖుర్షీద్, దుష్యంత్‌ దవే, మీనాక్షి అరోరా  ఉన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement