Archaeology Dept.: ఈ ఆయుధం 7 వేల సంవత్సరాల క్రితం నాటిది!

Department Of Archaeology  Found Ancient Weapon In Tamil Nadu - Sakshi

తమిళ భాష ప్రాచీమైనది అనేందుకు ఈ ఆయుధమే సాక్ష్యం

స్పష్టం చేస్తున్న పురావస్తు శాస్త్రవేత్తలు 

తిరువొత్తియూర్‌(తమిళనాడు): దిండిగల్‌ జిల్లా పలని షణ్ముఖ నదీతీరంలో సుమారు 7 వేల సంవత్సరాల క్రితం నాటి రాతి ఆయుధాన్ని పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. పురాతత్వ పరిశోధన బృందం జరిపిన తవ్వకాల్లో ఆ ఆయుధం పగిలిన స్థితిలో లభ్యమైంది. పురాతత్వ శాస్త్రవేత్త నారాయణ మూర్తి మాట్లాడుతూ మానవ చరిత్రను పాత రాతి యుగం, మధ్య రాతి యుగం, ఆధునిక రాతి యుగం, లోహ యుగంగా విభజించారన్నారు. ప్రస్తుతం లభించిన రాతి ఆయుధం.. కొత్త రాతి యుగానికి చెందినదని, ఈ కాలంలోనే తమిళుల మొదటి సంఘాకారం ప్రారంభమైందన్నారు. కొత్త రాతి యుగం ఆయుధాలను మానవులు జంతువులను వేటాడేందుకు ఉపయోగించినట్లు తెలిపారు.

ప్రస్తుతం లభించిన ఈ రాతి ఆయుధం కొన, వెనుక భాగం పూర్తిగా పగిలి ఉన్నట్లు తెలిపారు. దీనిపై ప్రాచీన తమిళ లిపి చెక్కి ఉందని, పైభాగంలో 8 అక్షరాలు కింది భాగంలో 5 అక్షరాలు ఉన్నట్లు వెల్లడించారు. దీనిపై తెన్నాన్‌ అని రాసి ఉండడం వల్ల ఈ ఆయుధం తెన్నాడన్‌కు సంబంధించి అయి ఉంటుందని భావిస్తున్నట్లు వెల్లడించారు. తమిళ లిపి ప్రాచీతమైందని చెప్పేందుకు ఈ రాతి ఆయుధం ముఖ్య సాక్ష్యంగా ఉపయోగపడుతుందని ఆయన స్పష్టం చేశారు.

(చదవండి: శశికళ రాజకీయ ప్రవేశంపై నిరసన గళాలు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top