‘అదొద్దు.. బుల్లెట్టే కావాలి​’.. వరునితోపాటు 50 మందిని బుక్‌ చేసిన పోలీసులు!

Demand for Bullet one Lakh Ruppees Dowry non Fulfilment Procession Returned - Sakshi

ఉత్తరప్రదేశ్‌లోని దెహాత్‌కు ఊరేగింపుగా వచ్చిన మగపెళ్లివారు వధువు తండ్రి తమకు బుల్లెట్‌ బండితోపాటు లక్ష రూపాలయల కట్నం అదనంగా ఇవ్వలేదని వెనుదిరిగారు. ఈ విషయమై పెళ్లి కుమార్తె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వరుడు, అతని తండ్రితో పాటు వారి తరుపు 50 మంది బంధువులపై కేసు నమోదు చేశారు.

మీడియాకు అందిన సమాచారం ప్రకారం రూరా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నౌరంగాబాద్‌ నివాసి మోతీలాల్‌ మగపెళ్లి వారు అదనపు కట్నం అడిగారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన ఫిర్యాదులో తన కుమార్తెకు మున్నూ సింగ్‌ కుమారుడు బాదల్‌తో వివాహం నిశ్చయమయ్యిందని తెలిపాడు. జూన్‌ 18న కల్యాణ మండపానికి వరుని తరపు వారంతా వచ్చారన్నాడు. వారికి ఘనంగా స్వాగత సత్కారాలు చేశామన్నాడు.

సరిగ్గా పెళ్లి తంతు ప్రారంభమయ్యే సమయానికి మగ పెళ్లివారు అదనపు కట్నం కోసం డిమాండ్‌ చేశారని తెలిపారు. బుల్లెట్‌ బండితోపాటు లక్ష రూపాయలు అదనంగా కావాలని కోరారన్నారు. వారు ఉన్నట్టుండి ఇలా అడిగేసరికి అడపెళ్లివారు, మగపెళ్లివారి మధ్య కొట్లాట జరిగిందని తెలిపారు. వరునికి ఇంతకు మునుపే ఒక బైక్‌ కొనుగోలు చేశామని, అయితే అది వద్దని బుల్లెట్‌ బండి మాత్రమే కావాలని అడుగుతున్నాడని వధువు తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వరుడు, అతని తండ్రితోపాటు మరో 50 మందిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: మహిళపై లైంగిక దాడి.. అడ్డుకుందని రైలులో నుంచి తోసివేత!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top