దీప్‌ సిద్ధు ఆచూకీ తెలిపితే రూ. లక్ష

Delhi Police Announced Rs 1 Lakh Reward for Information on Deep Sidhu - Sakshi

న్యూఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో రైతులు రెండు నెలలకు పైగా ఉద్యమం చేస్తోన్న సంగతి తెలిసిందే. దాదాపు 60 రోజులపాటు ప్రశాంతంగా సాగిన అన్నదాతల నిరసన.. గణతంత్ర దినోత్సవం నాడు ఉద్రిక్తంగా మారింది. హింస చోటు చేసుకుంది. అప్పటి వరకు రైతులకు మద్దతుగా నిలిచిన వారు వెనకంజ వేశారు. రైతు సంఘాల మధ్య కూడా చీలకలు వచ్చాయి. రైతు గణతంత్ర పరేడ్‌ పేరిట రైతు సంఘాలు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీలో తలెత్తిన విధ్వంసానికి నటుడు, సింగర్ దీప్ సిద్ధునే ప్రధాన కారకుడని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి.
(చదవండి: రైతుల కోసం రిహన్నా.. ఫూల్‌ అన్న కంగనా)

ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు దీప్‌ సిద్ధుపై బుధవారం నాడు లక్ష రూపాయాల రివార్డును ప్రకటించారు. రైతు గణతంత్ర పరేడ్‌ నాడు దీప్‌ సిద్ధు ఎర్రకోటపై జెండా ఎగురవేయడమే కాక ఫేస్‌బుక్‌ లైవ్‌లో జనాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. దాంతో ఉద్రిక్తతలు చేలరేగాయి. ఇక నాటి నుంచి ఆయన కన్పించకుండా పోయాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఢిల్లీ పోలీసులు దీప్ సిద్ధు ఆచూకీ తెలిపితే లక్ష రూపాయల రివార్డు ఇస్తామని ప్రకటించారు. దీప్ సిద్ధుతో పాటు మరో ముగ్గురిపై కూడ పోలీసులు రివార్డు ప్రకటించారు. దీప్ సిద్ధు కారణంగానే ఈ ఘటనలు చోటు చేసుకొన్నాయని రైతు సంఘాల నేతలు ఆరోపించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top