కేజ్రీవాల్‌ పిటిషన్‌.. తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ | Delhi High Court Hearing On Kejriwal Petition Updates | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్‌ పిటిషన్‌.. తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ

Apr 9 2024 9:26 AM | Updated on Apr 9 2024 10:27 AM

Delhi High Court Hearing On Kejriwal Petition Updates - Sakshi

 ఢిల్లీ లిక్కర్‌ కేసులో తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది.

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ కేసులో తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. ఈ కేసులో కేజ్రీవాల్‌ ప్రస్తుతం తీహార్‌ జైల్లోని జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.

తనను ఈడీ అరెస్టు చేసి.. రిమాండ్‌కు తరలించడంపై గతంలో ఆయన ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో ఈ పిటిషన్‌పై మంగళవారం న్యాయస్థానం తీర్పు చెప్పనుంది. ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఈ కేసుపై కీలక తీర్పు వెలువరించనున్నారు. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

కాగా, ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ఆప్‌ ఎమ్మెలే దుర్గేశ్‌ పాఠక్‌తో పాటు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పీఏ విభవ్‌ కుమార్‌ను సోమవారం ఈడీ ప్రశ్నించింది. సౌత్‌ గ్రూప్‌ నుంచి హవాలా రూపంలో తీసుకున్న రూ.45 కోట్లను గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఆప్‌ వాడిందని ఈడీ ఆరోపిస్తుండటం తెలిసిందే.

ఆ ఎన్నికల్లో గోవాకు పాఠక్‌ ఇన్‌చార్జిగా ఉన్నారు. ఎన్నికల వేళ జరిగిన నగదు లావాదేవీలపై ఆయన్ను ఈడీ ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ కేసులో కీలక పత్రాలకు సంబంధించిన వివరాల కోసం విభన్‌ను  విచారించింది. పాఠక్‌ను విచారించడంపై ఢిల్లీ మంత్రి అతిశి మండిపడ్డారు. ఆప్‌ నేతలను ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా చేసేందుకే విచారణ పేరుతో బీజేపీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement