
ఢిల్లీ: వామ్మో..నేను బతుకుంటే.. బలుసాకైనా అమ్ముకుని బతికేస్తా.. కానీ మీ కంపెనీలో మాత్రం ఉద్యోగం చేయను బాబోయ్ అంటూ ఓ వ్యక్తి ఉద్యోగంలో చేరిన మొదటి రోజే..లంచ్ టైంలో జాబ్‌కు రిజైన్ చేసి బయటకు వచ్చాడు. ప్రస్తుతం ఈ ఘటన కార్పొరేట్ కంపెనీల్లో టాక్సిక్ వర్క్ కల్చర్‌కు అద్దం పడుతోంది.
సోషల్ మీడియాలో ఓ ట్వీట్ వైరల్‌గా మారింది.ఆ ట్వీట్ సారాశం ఏంటంటే?. నా స్నేహితుడు ఢిల్లీకి చెందిన స్టార్టప్‌లో చేరాడు. చేరిన తొలిరోజు లంచ్ టైం వరకు పనిచేశాడు. లంచ్ టైం తర్వాత తన ల్యాప్‌ట్యాప్‌ను కూడా డెస్క్‌పై వదిలేసి బయటకు వెళ్లిపోయాడు. ఆఫీస్ నుంచి వెళ్లిన తర్వాత..సదరు కంపెనీ ప్రతినిధులు ఫోన్స్ చేస్తూనే ఉన్నారు. మా ఫ్రెండ్ వాటికి రిప్లయి ఇవ్వలేదు.కానీ చివరికి కంపెనీ హెచ్‌ఆర్ నుంచి ఫోన్ రావడంతో రిప్లయి ఇవ్వక తప్పలేదు. హెచ్‌ఆర్‌తో బతుకుంటే బులుసాకైనా అమ్ముకుంటా కానీ మీ కంపెనీలో నేను పని చేయనని తేల్చి చెప్పాడు’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నాడు.
ఆ ట్వీట్‌పై నెటిజన్లు పాజిటీవ్‌గా స్పందిస్తున్నారు. చేరిన తొలిరోజే ఉద్యోగానికి రిజైన్ చేసిన వ్యక్తి ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు. స్టార్టప్ కల్చర్‌లో ఒత్తిడి ఉంటుంది. మానసిక ప్రశాంతత కావాలంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సబబే. ఇది ఆశ్చర్యకరం కాదు. స్టార్టప్ కల్చర్ కొన్నిసార్లు తట్టుకోలేని విధంగా ఉంటుంది.మొదటి రోజే వర్క్ ప్లేస్ సరిగా అనిపించకపోతే,వెళ్లిపోవడం మంచిదే’అని మరొకరు వ్యాఖ్యానించారు. ఇంకొకరు ఇలాంటివి చాలా జరుగుతుంటాయి. చాలా మంది ప్లాన్ చేస్తారు, కానీ కొద్దిమంది మాత్రమే అమలు చేస్తారు’అంటూ మరో నెటిజన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
ఈ సంఘటన జెన్‌జీ వర్క్ కల్చర్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోందని మానసిక నిపుణులు చెబుతున్నారు. జెన్‌జీకి వర్క్ కల్చర్ బాగుండాలి. అంటే పనిచేసే కార్యాలయం తమ మనసుకు అనుగుణంగా ఉంటే ఫర్లేదు. లేదుంటే మానసిక ప్రశాంతను చెడగొట్టుకుని పనిచేకపోవడం ఇష్టం ఉండదు. అందుకే వెంటే రాజీనామా చేస్తారు.
A friend told me about this guy who joined a startup here in Delhi. On his very first day, he left his laptop on his desk during lunch and just never came back. He ignored everyone’s calls initially but later picked up HR’s, and just said he cannot work there 😭
— Poan Sapdi (@Poan__Sapdi) August 19, 2025