India Covid Cases: India Has Recorded 10542 New Covid Cases, Details Inside - Sakshi
Sakshi News home page

Covid-19: కోవిడ్ గుప్పిట్లో ఢిల్లీ.. ఏకంగా 430 శాతం పెరిగిన కేసులు.. దేశంలో మళ్లీ 10వేలకు పైగా..

Apr 19 2023 10:38 AM | Updated on Apr 19 2023 1:17 PM

Delhi Covid Cases Surge 430 percent India Reports 10542 New Cases - Sakshi

పాజిటివిటీ రేటు కూడా 26.54 శాతంగా ఉండటం కలవారుపాటుకు గురిచేస్తోంది

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ కోవిడ్ గుప్పిట్లో చిక్కుకుంది. కొత్త కేసుల్లో గణనీయమైన వృద్ధి నమోదవుతోంది. మూడు వారాల లోపే కేసుల సంఖ్య ఏకంగా 430 శాతం పెరిగిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగే పాజిటివిటీ రేటు కూడా 26.54 శాతంగా ఉండటం కలవారుపాటుకు గురిచేస్తోంది.

మార్చి 30న ఢిల్లీలో 4,976 కేసులు ఉండగా.. ఏప్రిల్‌ 17నాటికి ఆ సంఖ్య 13,200కు చేరింది. తాజాగా బుధవారం మరో 1,537 కేసులు వెలుగుచూశాయి. మరో ఐదుగురు వైరస్‌కు బలయ్యారు. ఫలితంగా ఢిల్లీలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 20,25,781కి చేరింది. మృతుల సంఖ్య 26,572గా ఉంది.

దేశంలో 10వేలకు పైగా కొత్త కేసులు..
మరోవైపు దేశంలో కరోనా కొత్త కేసులు క్రితం రోజుతో పోల్చితే భారీగా పెరిగి మళ్లీ 10వేల మార్కును దాటాయి. మంగళవారం 7,633 కేసులు వెలుగుచూడగా.. బుధవారం ఆ సంఖ్య 10,542కు పెరిగింది. మరో 38 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 63,562గా ఉంది. మొత్తం మృతుల సంఖ్య 5,31,190కి చేరింది. రికవరీ రేటు 98.67శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా మంగళవారం నాటికి 220.66 కోట్ల కరోనా టీకా డోసులు పంపిణీ చేశారు.
చదవండి: పెళ్లీడు పెరిగింది.. తెలంగాణ అమ్మాయిలు ఎన్నేళ్లకు పెళ్లి చేసుకుంటున్నారంటే..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement