Mohammed Zubair Death Threats: చంపేస్తామంటూ బెదిరింపులు.. కోర్టును ఆశ్రయించిన జుబేర్‌

Death Threats To Fact Checker Mohammed Zubair - Sakshi

న్యూఢిల్లీ: మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టిన ఆరోపణలపై ఫ్యాక్ట్‌చెక్‌ వెబ్‌సైట్‌ ‘ఆల్ట్‌ న్యూస్‌’ సహ వ్యవస్థాపకుడు, జర్నలిస్టు మహ్మద్‌ జుబేర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌చేసిన విషయం తెలిసిందే. కాగా, మ‌హ్మ‌ద్ జుబేర్ బెయిల్ కోసం అ‍త్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్ర‌యించాడు. 

అయితే, మ‌హ్మాద్ జుబేర్‌కు ప్రాణ హాని ఉంద‌ని, ఆయ‌న‌కు ప‌లువురి నుంచి బెదిరింపులు వ‌స్తున్నాయ‌ని భ‌ద్ర‌త‌పై ఆందోళ‌న చెందుతున్నామ‌ని జుబేర్ న్యాయ‌వాది సీనియ‌ర్ అడ్వ‌కేట్ కొలిన్ గొన్‌సేల్వ్స్ సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు వెంటనే.. జుబేర్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టాలని న్యాయవాది కోరారు. 

కాగా, న్యాయవాది విజ్ఞప్తి మేరకు.. రిజిస్ట్రీలో బెయిల్‌ పిటిషన్‌ అంశం రిజిస‍్టర్‌ అవడంతో రేపు(శుక‍్రవారం) విచారణ చేపట్టనున్నట్టు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇక, నాలుగేళ్ల కిందట ఆయన షేర్‌ చేసిన ఓ ట్వీట్‌ పట్ల తీవ్రఅభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆ ట్వీట్‌ మతపరమైన సెంటిమెంట్లను దెబ్బతీసేదిగా ఉందని, విద్వేషాలను రగిల్చేదిగా ఉందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. దీంతో ఢిల్లీ పోలీసులు.. జుబేర్‌ను అరెస్ట్‌ చేశారు. అనంతరం యూపీలోని సీతాపూర్‌ కోర్టులో హాజరుపరుచగా.. కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. 

ఇది కూడా చదవండి: రైల్వే ట్రాక్‌పై ట్రక్కును ఢీకొట్టిన ప్యాసింజర్‌ రైలు.. వీడియో వైరల్‌

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top