Cyclone Mocha: గురువారంకల్లా భీకర మోచా తుపానుగా అల్పపీడనం.. అక్కడ భారీ వర్షాలు

Cyclone Mocha likely to develop over Bay of Bengal - Sakshi

పోర్ట్‌ బ్లెయిర్‌/భువనేశ్వర్‌: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మోచా తుపానుగా మారబోతోంది. దీని ప్రభావంతో అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. సంబంధిత వివరాలను భారత వాతావరణ శాఖ బుధవారం వెల్లడించింది. ‘అండమాన్, నికోబార్‌ దీవుల్లోని పోర్ట్‌ బ్లెయిర్‌ సమీపంలో అల్పపీడనం కేంద్రీకృతమైంది. అది గురువారంకల్లా భీకర మోచా తుపానుగా మారి ఆ దీవుల్లో భారీ వర్షాలకు కారణమవుతుంది.

తర్వాత బంగాళాఖాతం ఆగ్నేయ, సమీప ప్రాంతాల్లో తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మే 13న కాస్తంత బలహీనపడి బంగ్లాదేశ్‌లోని కాక్స్‌ బజార్, మయన్మార్‌లోని క్యావూక్‌ప్యూ పట్టణాల మధ్య తుపాను తీరం దాటనుంది. మే 14న గంటకు 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జాలర్లు చేపలవేట కోసం సముద్రంలోకి వెళ్లకపోవడం శ్రేయస్కరం’ అని కోల్‌కతా రీజియన్‌ డైరెక్టర్‌ జీకే దాస్‌ చెప్పారు. అత్యవసర నిర్వహణ కేంద్రాల ద్వారా నిరంతరం పరిస్థితిని అంచనావేస్తూ తీరప్రాంతవాసులను అప్రమత్తం చేస్తామన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top